ఏమి సేయవచ్చుఁ గాల మెవ్వరి నెంత సేసునో
(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చుఁ గాల మెవ్వరి నెంత సేసునో
నేమాన నవ్వెటి నన్ను నివ్వెర గందించెను
(॥ఏమి॥)
పలుకు బంతపు నన్నుఁ బ్రాయముగ నింత సేసె
చెలుల కెల్లాఁ బ్రియము చెప్పించెను
అలరు రాజసపు న న్నాసలుగా యింత సేసె
నలి రమణునింటికి నడపించెను
(॥ఏమి॥)
వాసితో నుండేటి నన్ను వలపుగా యింత నేనె
వేసాల ఆతని మాటె వినిపించెను
పోసరించి వుండేనన్ను పొందుగా యింత సేసె
పాసితే విరహవేదనపాలు సేనెను
(॥ఏమి॥)
సిగ్గుతో నుండేనన్ను చిత్తమెకా యింత నేనె
తగ్గనితమకములఁ దగిలించెను
వెగ్గళించి యింతలో శ్రీవెంకటేశఁ డిటు గూడె
అగ్గలపు నా రతులె కా అన్ని టాను మించెను
(||pallavi||)
emi seyavachchum̐ gāla mĕvvari nĕṁta sesuno
nemāna navvĕḍi nannu nivvĕra gaṁdiṁchĕnu
(||emi||)
palugu baṁtabu nannum̐ brāyamuga niṁta sesĕ
sĕlula kĕllām̐ briyamu sĕppiṁchĕnu
alaru rājasabu na nnāsalugā yiṁta sesĕ
nali ramaṇuniṁṭigi naḍabiṁchĕnu
(||emi||)
vāsido nuṁḍeḍi nannu valabugā yiṁta nenĕ
vesāla ādani māḍĕ vinibiṁchĕnu
posariṁchi vuṁḍenannu pŏṁdugā yiṁta sesĕ
pāside virahavedanabālu senĕnu
(||emi||)
siggudo nuṁḍenannu sittamĕgā yiṁta nenĕ
tagganidamagamulam̐ dagiliṁchĕnu
vĕggaḽiṁchi yiṁtalo śhrīvĕṁkaḍeśham̐ ḍiḍu gūḍĕ
aggalabu nā radulĕ kā anni ṭānu miṁchĕnu