ఏమి సేయవచ్చుఁ దొల్లి యిటు నోచినఁ(నం?)తేకాక
(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చుఁ దొల్లి యిటు నోచినఁ(నం?)తేకాక
వోమిన నీమాట నీకే వొప్పనాయఁగా
(॥ఏమి॥)
ఆకడనే వుండ వేడుకాయఁగా నీకు నే-
నీకడ నీకు వలచి యిటులుండఁగా
ఆకెమోము చూచుటే పనాయఁగా నీకు నేఁడు
పైకొని నీదిక్కు నేఁ దప్పకచూడఁగాను
(॥ఏమి॥)
మంతనమందే నీకు మనసాయఁగా నేఁ
జింతతో నీకుఁగా మరిఁ చెదరఁగాను
పొంత జాణతనమందే పొద్దువోయఁగా యీడ
వింతనీవిరహన నే వేగించఁగాను
(॥ఏమి॥)
తగునాకాఁగిట నాకె తలపాయఁగా నీకు
బిగువుఁగాఁగిట నేఁ బెనచఁగాను
నగుతా శ్రీవేంకటేశ నన్ను భ్రమయించితిగా నేఁ
బగటురతుల నీతోఁ బంతమాడఁగాను
(||pallavi||)
emi seyavachchum̐ dŏlli yiḍu nosinam̐(naṁ?)tegāga
vomina nīmāḍa nīge vŏppanāyam̐gā
(||emi||)
āgaḍane vuṁḍa veḍugāyam̐gā nīgu ne-
nīgaḍa nīgu valasi yiḍuluṁḍam̐gā
āgĕmomu sūsuḍe panāyam̐gā nīgu nem̐ḍu
paigŏni nīdikku nem̐ dappagasūḍam̐gānu
(||emi||)
maṁtanamaṁde nīgu manasāyam̐gā nem̐
jiṁtado nīgum̐gā marim̐ sĕdaram̐gānu
pŏṁta jāṇadanamaṁde pŏdduvoyam̐gā yīḍa
viṁtanīvirahana ne vegiṁcham̐gānu
(||emi||)
tagunāgām̐giḍa nāgĕ talabāyam̐gā nīgu
biguvum̐gām̐giḍa nem̐ bĕnasam̐gānu
nagudā śhrīveṁkaḍeśha nannu bhramayiṁchidigā nem̐
bagaḍuradula nīdom̐ baṁtamāḍam̐gānu