Emi seyavachchum daane yerimgee gaaga

ఏమి సేయవచ్చుఁ దానే యెరిఁగీ గాక
Language

(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చుఁ దానే యెరిఁగీ గాక
సాములు సేసి పెనఁగీ జడియకువయ్యా

(॥ఏమి॥)
వాసనకస్తూరి మేన వలపులు చల్లఁగానే
యీసు రేఁగి చెలి నీమో మిటు చూచెను
మోసపోక నీవెందుండో మోచి తెచ్చినప్రయాస-
మోసరించి చూడదాయ నొక్కించుకైనాను

(॥ఏమి॥)
కొత్తయై కంటసరి కోరి మెడఁ గటపగాను
హత్తి చెలి కోపగించి ఆన వెట్టెను
మొత్తాన నెందో గడించి మొగిఁ దెచ్చి యిచ్చినది
చిత్తమునఁ బెట్టదాయ చెప్పఁగ నే మున్నది

(॥ఏమి॥)
శ్రీవేంకటేశ నీవు దెచ్చినవీడె మిటు చూచి
భావనలు వేరె సేని పట్టదాయను
ఆవటించి కప్పముగ నాడా నీడాఁ దెచ్చి నీవు
కాపరించి కూడితివి కతలు మరచెను

(||pallavi||)
emi seyavachchum̐ dāne yĕrim̐gī gāga
sāmulu sesi pĕnam̐gī jaḍiyaguvayyā

(||emi||)
vāsanagastūri mena valabulu sallam̐gāne
yīsu rem̐gi sĕli nīmo miḍu sūsĕnu
mosaboga nīvĕṁduṁḍo mosi tĕchchinaprayāsa-
mosariṁchi sūḍadāya nŏkkiṁchugainānu

(||emi||)
kŏttayai kaṁṭasari kori mĕḍam̐ gaḍabagānu
hatti sĕli kobagiṁchi āna vĕṭṭĕnu
mŏttāna nĕṁdo gaḍiṁchi mŏgim̐ dĕchchi yichchinadi
sittamunam̐ bĕṭṭadāya sĕppam̐ga ne munnadi

(||emi||)
śhrīveṁkaḍeśha nīvu dĕchchinavīḍĕ miḍu sūsi
bhāvanalu verĕ seni paṭṭadāyanu
āvaḍiṁchi kappamuga nāḍā nīḍām̐ dĕchchi nīvu
kābariṁchi kūḍidivi kadalu marasĕnu