ఏమి సేయవచ్చు నిఁక నియ్యకొనవలెఁ గాక
(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చు నిఁక నియ్యకొనవలెఁ గాక
దీమసపు టాసలే కా దిమ్మరిఁ జేసినవి
(॥॥)
చెలరేఁ గాపె సుద్దలే చెప్పేవు పలుమారు
చెలులతోనెల్లా నీవు సిగ్గువడక
నలువంక సవతులు నవ్వే రిందురు నిన్ను
వలపుగా నిన్ను నింత వాఁటము సేసినది
(॥॥)
సూటిగా నాపెమెట్టెలు చూపేవు నీవేలఁ బెట్టి
చీటికిమాటికి నీవు సిగ్గుపడక
చాటువగా నండవారు సన్న సేసే దెఱఁగవు
పాటించి మనసేకా పచ్చిగాఁ జేసినది
(॥॥)
వడి నాపెకుఁ బూనుక వచ్చేవు శ్రీ వేంకటేశ
చిడుముడి నన్నేలితి సిగ్గువడక
పడఁతులు నీచేఁతలు పట్టి ఇచ్చేది యెంచవు
కడఁగి నీవయసేకా కళలు నించినది
(||pallavi||)
emi seyavachchu nim̐ka niyyagŏnavalĕm̐ gāga
dīmasabu ṭāsale kā dimmarim̐ jesinavi
(||||)
sĕlarem̐ gābĕ suddale sĕppevu palumāru
sĕluladonĕllā nīvu sigguvaḍaga
naluvaṁka savadulu navve riṁduru ninnu
valabugā ninnu niṁta vām̐ṭamu sesinadi
(||||)
sūḍigā nābĕmĕṭṭĕlu sūbevu nīvelam̐ bĕṭṭi
sīḍigimāḍigi nīvu siggubaḍaga
sāḍuvagā naṁḍavāru sanna sese dĕṟam̐gavu
pāḍiṁchi manasegā pachchigām̐ jesinadi
(||||)
vaḍi nābĕgum̐ būnuga vachchevu śhrī veṁkaḍeśha
siḍumuḍi nannelidi sigguvaḍaga
paḍam̐tulu nīsem̐talu paṭṭi ichchedi yĕṁchavu
kaḍam̐gi nīvayasegā kaḽalu niṁchinadi