Emi seyavachchu nimka nivellaa naaneramule

ఏమి సేయవచ్చు నిఁక నివెల్లా నానేరములె
Language

(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చు నిఁక నివెల్లా నానేరములె
దీమసాన లోలోనే తెలుసుకోనైతి

(॥ఏమి॥)
చెప్పెఁగా నీగుణాలెల్లా చెలియ నాతో నాఁడె
నెప్పున నీసేవ సేయ నేరనైతి
వొవ్పగించెఁగా నీవుంగరము నా చేతికి
చొప్పులవి సాధించి చూడనైతి

(॥ఏమి॥)
నవ్వెఁగా వూడిగమాపె నను నిన్నూనిట్టె చూపి
జవ్వనమదమున విచారించనైతి
పువ్వులను వేసెఁగా పొంచి యాకె వుండుమని
యెవ్వతో నీవద్ద నుంట యెరఁగనైతి

(॥ఏమి॥)
సన్న సేసెఁగా నాకు సరుస నా చెల్లెలు
అన్నిటా నిన్ను మాట్టి ట్టడుగనైతి
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
యెన్నుకొని నీరతులు యిటు వొగడనైతి

(||pallavi||)
emi seyavachchu nim̐ka nivĕllā nāneramulĕ
dīmasāna lolone tĕlusugonaidi

(||emi||)
sĕppĕm̐gā nīguṇālĕllā sĕliya nādo nām̐ḍĕ
nĕppuna nīseva seya neranaidi
vŏvpagiṁchĕm̐gā nīvuṁgaramu nā sedigi
sŏppulavi sādhiṁchi sūḍanaidi

(||emi||)
navvĕm̐gā vūḍigamābĕ nanu ninnūniṭṭĕ sūbi
javvanamadamuna visāriṁchanaidi
puvvulanu vesĕm̐gā pŏṁchi yāgĕ vuṁḍumani
yĕvvado nīvadda nuṁṭa yĕram̐ganaidi

(||emi||)
sanna sesĕm̐gā nāgu sarusa nā sĕllĕlu
anniḍā ninnu māṭṭi ṭṭaḍuganaidi
yinniḍā śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
yĕnnugŏni nīradulu yiḍu vŏgaḍanaidi