ఏమి సేయవచ్చు నిఁక నెవ్వరితో నాడేము
(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చు నిఁక నెవ్వరితో నాడేము
నీ మన సెఱఁగనిది నేము చెప్పేమా
(॥॥)
నెలవుల నగనా చెప్పినట్టు సేయనా
కొలఁదిమీర నన్నేల కొసరేవు
తలుపుమాఁటుననున్న తరుణి నడుగరాదా
యెలమి నీయంత నీవు యెఱఁగకుండితేను
(॥॥)
సేస నీపైఁ బెట్టనా చేతికి విడెమియ్యనా
వేసాలకు నన్నునేల వేఁడుకొనేవు
యీసుద్ది నీవెనకదిక్కింతిని నడుగరాదా
దోసము పుణ్యము నీకుఁ దోఁచకుండితేను
(॥॥)
కైవసమై కూడనా కాఁగిలించుకొననా
శ్రీ వేంకటేశుఁడ నాచెక్కు నొక్కేవు
భావము నీదాఁపిరముపడఁతి నడుగరాదా
చేవమీఱినసిగ్గునఁ జెప్పరాకుండితేను
(||pallavi||)
emi seyavachchu nim̐ka nĕvvarido nāḍemu
nī mana sĕṟam̐ganidi nemu sĕppemā
(||||)
nĕlavula naganā sĕppinaṭṭu seyanā
kŏlam̐dimīra nannela kŏsarevu
talubumām̐ṭunanunna taruṇi naḍugarādā
yĕlami nīyaṁta nīvu yĕṟam̐gaguṁḍidenu
(||||)
sesa nībaim̐ bĕṭṭanā sedigi viḍĕmiyyanā
vesālagu nannunela vem̐ḍugŏnevu
yīsuddi nīvĕnagadikkiṁtini naḍugarādā
dosamu puṇyamu nīgum̐ dom̐saguṁḍidenu
(||||)
kaivasamai kūḍanā kām̐giliṁchugŏnanā
śhrī veṁkaḍeśhum̐ḍa nāsĕkku nŏkkevu
bhāvamu nīdām̐piramubaḍam̐ti naḍugarādā
sevamīṟinasiggunam̐ jĕpparāguṁḍidenu