ఏమి సేయవచ్చు నందు కేమాయను
(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చు నందు కేమాయను
నీ మనసు నొప్పించనేర నిఁక నేను
(॥ఏమి॥)
ఆడఁగలమాటలు ని న్నాడితి నే నల్లనాఁడె
యేడ నీ వేమి సేసిరా యెదురాడేనా
కూడా రాను పాయలేదు గుట్టుతోడ నీపాటిఁ
వీడె మిచ్చే నింతేసుమ్మీ వెరవకు నాకును
(॥ఏమి॥)
సేయఁగలసేఁత లెల్లాఁ జేసితి నే నల్ల నాఁడె
నీయందుఁ దప్పు లుండీనీ నిను మీరేనా
చాయ సేసుకోరాను చలము నిన్ను సాదించ
దాయిదండనై వుండే నింతే తలవంచ కిఁకను
(॥ఏమి॥)
మెచ్చఁగలట్టెల్లా నిన్ను మెచ్చితి నే నల్లనాఁడె
విచ్చనవిడి నీ వున్నా వేగిరించేనా
యిచ్చకుఁడ శ్రీవేంకటేశ నిన్నుఁగూడి నేను
పచ్చడము గప్పే నింతే బడులకు మిఁకను
(||pallavi||)
emi seyavachchu naṁdu kemāyanu
nī manasu nŏppiṁchanera nim̐ka nenu
(||emi||)
āḍam̐galamāḍalu ni nnāḍidi ne nallanām̐ḍĕ
yeḍa nī vemi sesirā yĕdurāḍenā
kūḍā rānu pāyaledu guṭṭudoḍa nībāḍim̐
vīḍĕ michche niṁtesummī vĕravagu nāgunu
(||emi||)
seyam̐galasem̐ta lĕllām̐ jesidi ne nalla nām̐ḍĕ
nīyaṁdum̐ dappu luṁḍīnī ninu mīrenā
sāya sesugorānu salamu ninnu sādiṁcha
dāyidaṁḍanai vuṁḍe niṁte talavaṁcha kim̐kanu
(||emi||)
mĕchcham̐galaṭṭĕllā ninnu mĕchchidi ne nallanām̐ḍĕ
vichchanaviḍi nī vunnā vegiriṁchenā
yichchagum̐ḍa śhrīveṁkaḍeśha ninnum̐gūḍi nenu
pachchaḍamu gappe niṁte baḍulagu mim̐kanu