ఏమి సేయవచ్చు భాగ్యా లెవ్వరి కెట్టుండునో
(॥పల్లవి॥)
ఏమి సేయవచ్చు భాగ్యా లెవ్వరి కెట్టుండునో
ఆమని కాలము గాఁగా నగ్గువాయ నదివో
(॥ఏమి॥)
కొంగువట్టి తియ్యఁగాను కొమ్మ సిగ్గువడితేను
కంగి కోపగించెనంటా కాఁకరేఁగేవు
చెంగటఁ జవిగొంటేను చప్పనాయను
(॥ఏమి॥)
పగటుమాటలాడఁగ పడఁతి నవ్వు నవ్వితే
యెగసక్కేలంటా లోలో యీసడించేవు
వెగటుగాఁ జెప్పఁబోతే వొగరులాయఁ బ్రియము
మిగులా వడ్డించఁబోతే మించి కారమాయను
(॥ఏమి॥)
యీదెసఁ బెనఁగఁగాను ఇంతి సరసమాడితే
పాదము దాఁకించెనంటా పంతమాడేవు
సాదించి శ్రీవేంకటేశ జంకించితేఁ బులుసాయ
దాదాతఁ గూడితేను తరితీపులాయను
(||pallavi||)
emi seyavachchu bhāgyā lĕvvari kĕṭṭuṁḍuno
āmani kālamu gām̐gā nagguvāya nadivo
(||emi||)
kŏṁguvaṭṭi tiyyam̐gānu kŏmma sigguvaḍidenu
kaṁgi kobagiṁchĕnaṁṭā kām̐karem̐gevu
sĕṁgaḍam̐ javigŏṁṭenu sappanāyanu
(||emi||)
pagaḍumāḍalāḍam̐ga paḍam̐ti navvu navvide
yĕgasakkelaṁṭā lolo yīsaḍiṁchevu
vĕgaḍugām̐ jĕppam̐bode vŏgarulāyam̐ briyamu
migulā vaḍḍiṁcham̐bode miṁchi kāramāyanu
(||emi||)
yīdĕsam̐ bĕnam̐gam̐gānu iṁti sarasamāḍide
pādamu dām̐kiṁchĕnaṁṭā paṁtamāḍevu
sādiṁchi śhrīveṁkaḍeśha jaṁkiṁchidem̐ bulusāya
dādādam̐ gūḍidenu taridībulāyanu