ఏమి సేయఁగలము మీ రిద్దరును నిద్దరే
(॥పల్లవి॥)
ఏమి సేయఁగలము మీ రిద్దరును నిద్దరే
దోమటి దొడికి మీలో దొమ్మిసేయరాదా
(॥ఏమి॥)
ఆతనినీచూపునే అవి తారుకాణగాక
యీతల నేము తార్కాణా ఇంతులము
కాతరపు మాటలేల కందువకుఁ దీసి పతి
చేతులార బుజగించి సేవ సేయరాదా
(॥ఏమి॥)
చెలఁగి మీరువెట్టిన సేసలే గుఱుతుగాక
అలుకకు వద్దిచెలులందరు గుఱే
పెలుచుఁ దనములేల పెంపునఁ బానుపుమీఁద
చలములన్నీఁ దీర సాదించరాదా
(॥ఏమి॥)
కూడినమీ కాఁగిటి కూటమే మెచ్చులుగాక
వూడిగపువారిమెచ్చు లొద్దికయ్యీనా
వేడుకఁ గూడితివి శ్రీవేంకటేశు నిట్టే మరి
వాడుదేర మోవి ఇచ్చి వన్నె నేయరాదా
(||pallavi||)
emi seyam̐galamu mī riddarunu niddare
domaḍi dŏḍigi mīlo dŏmmiseyarādā
(||emi||)
ādaninīsūbune avi tārugāṇagāga
yīdala nemu tārgāṇā iṁtulamu
kādarabu māḍalela kaṁduvagum̐ dīsi padi
sedulāra bujagiṁchi seva seyarādā
(||emi||)
sĕlam̐gi mīruvĕṭṭina sesale guṟudugāga
alugagu vaddisĕlulaṁdaru guṟe
pĕlusum̐ danamulela pĕṁpunam̐ bānubumīm̐da
salamulannīm̐ dīra sādiṁcharādā
(||emi||)
kūḍinamī kām̐giḍi kūḍame mĕchchulugāga
vūḍigabuvārimĕchchu lŏddigayyīnā
veḍugam̐ gūḍidivi śhrīveṁkaḍeśhu niṭṭe mari
vāḍudera movi ichchi vannĕ neyarādā