ఏమి సేయమనేవయ్యా యింకా నన్ను
(॥పల్లవి॥)
ఏమి సేయమనేవయ్యా యింకా నన్ను
కామించి నీ మన్ననలు గైకొంటి నేను
(॥ఏమి॥)
వొద్దనేఁ గూచుండనా వూఁకొననా నీమాటలు
కద్దు నిజమేయననా కానిమ్మననా
గుద్దిరము మానవంటా కొసరేవు కమ్మటిని
ముద్దుముద్దువలె నీముంగిట నుందానను
(॥ఏమి॥)
పాదాలు పిసుకనా బత్తిసేయనా నీకు
సాదువలె నుండనా సమ్మతించనా
సోదించక మాననంటా సొలసేవు కమ్మటిని
సాదించి నీ సేవకు మంచముపై నుందానను
(॥ఏమి॥)
గక్కన విడెమియ్యనా కాఁగిలించి కూడనా
మిక్కిలి నీకు లోఁగానా మెచ్చు మెచ్చనా
యెక్కువ శ్రీవేంకటేశ యేలితివి నన్ను: నాకు
దక్కితిని కమ్మటిని తగిలివుందానను
(||pallavi||)
emi seyamanevayyā yiṁkā nannu
kāmiṁchi nī mannanalu gaigŏṁṭi nenu
(||emi||)
vŏddanem̐ gūsuṁḍanā vūm̐kŏnanā nīmāḍalu
kaddu nijameyananā kānimmananā
guddiramu mānavaṁṭā kŏsarevu kammaḍini
muddumudduvalĕ nīmuṁgiḍa nuṁdānanu
(||emi||)
pādālu pisuganā battiseyanā nīgu
sāduvalĕ nuṁḍanā sammadiṁchanā
sodiṁchaga mānanaṁṭā sŏlasevu kammaḍini
sādiṁchi nī sevagu maṁchamubai nuṁdānanu
(||emi||)
gakkana viḍĕmiyyanā kām̐giliṁchi kūḍanā
mikkili nīgu lom̐gānā mĕchchu mĕchchanā
yĕkkuva śhrīveṁkaḍeśha yelidivi nannu: nāgu
dakkidini kammaḍini tagilivuṁdānanu