Emi sesuno ninnu yimkaa naabe

ఏమి సేసునో నిన్ను యింకా నాపె
Language

(॥పల్లవి॥)
ఏమి సేసునో నిన్ను యింకా నాపె
ప్రేమ నాపైఁ జేసేవంటా బెనఁగీ నాపె

(॥ఏమి॥)
మలసి నీతో నేను మాఁటలాడితినంటా
చలము సాదించి నిన్ను జంకించీ నాపె
నలిరేఁగి నీవప్పటి నవ్వులు నవ్వితివంటా
పెలుచుంబంతములెల్లాఁ బెంచీ నాపె

(॥ఏమి॥)
చేతులెత్తి నే నీకు సిగ్గున మొక్కితినంటా
కాతరించి సారె నిన్నుఁ గసరీ నాపె
ఆతుమెల్లా నీవు నాతో నట్టె చెప్పితివంటా
యేతులెత్తి నీమీఁద యెమ్మెచూపీ నాపె

(॥ఏమి॥)
యేకతాన నీతో నే నెనసివుందానవంటా
యీకడ నీవురమెక్కె నింతో నాపె
చేకొని కూడితి నిట్టె శ్రీవేంకటేశ్వర నీవు
దాకొనె నలమేల్మంగ తానే యాపె

(||pallavi||)
emi sesuno ninnu yiṁkā nābĕ
prema nābaim̐ jesevaṁṭā bĕnam̐gī nābĕ

(||emi||)
malasi nīdo nenu mām̐ṭalāḍidinaṁṭā
salamu sādiṁchi ninnu jaṁkiṁchī nābĕ
nalirem̐gi nīvappaḍi navvulu navvidivaṁṭā
pĕlusuṁbaṁtamulĕllām̐ bĕṁchī nābĕ

(||emi||)
sedulĕtti ne nīgu sigguna mŏkkidinaṁṭā
kādariṁchi sārĕ ninnum̐ gasarī nābĕ
ādumĕllā nīvu nādo naṭṭĕ sĕppidivaṁṭā
yedulĕtti nīmīm̐da yĕmmĕsūbī nābĕ

(||emi||)
yegadāna nīdo ne nĕnasivuṁdānavaṁṭā
yīgaḍa nīvuramĕkkĕ niṁto nābĕ
segŏni kūḍidi niṭṭĕ śhrīveṁkaḍeśhvara nīvu
dāgŏnĕ nalamelmaṁga tāne yābĕ