Emi sesugunnaamdavo yeṟimgi rammane nimti

ఏమి సేసుకున్నాఁడవో యెఱిఁగి రమ్మనె నింతి
Language

(॥పల్లవి॥)
ఏమి సేసుకున్నాఁడవో యెఱిఁగి రమ్మనె నింతి
కామించి ఇంతలో నీవిక్కడికి వచ్చితివి

(॥ఏమి॥)
చెలియ నీకుఁ దొల్లిచేసినవూడిగాలు
తలఁపౌనా యెన్నఁడైనా తమితోడను
యెలమిఁ గేళాకూళిలో నీఁదులాడిననేర్పులు
చెలిమికత్తెలతోడఁ జెప్పుకొందువా

(॥ఏమి॥)
గుదిగోన నిన్నాపె కుంకుమగుబ్బల నొత్తి -
నది నీమేనిపై గుఱుతైవున్నదా
వదలక పూఁదోఁటలో వసంతములాడినది
పోదలి యావినోద మెప్పుడు నెంచుకొందువా

(॥ఏమి॥)
నెట్టన నలమేల్‌మంగ నీకు లేకలంపినది
గుట్టుతోడనే చదువు కొంటివా నీవు
చుట్టమవై యేలితివి చూచి యీపె నీతో నవ్వె
పట్టపు శ్రీవేంకటేశ భావించుకొందువా

(||pallavi||)
emi sesugunnām̐ḍavo yĕṟim̐gi rammanĕ niṁti
kāmiṁchi iṁtalo nīvikkaḍigi vachchidivi

(||emi||)
sĕliya nīgum̐ dŏllisesinavūḍigālu
talam̐paunā yĕnnam̐ḍainā tamidoḍanu
yĕlamim̐ geḽāgūḽilo nīm̐dulāḍinanerbulu
sĕlimigattĕladoḍam̐ jĕppugŏṁduvā

(||emi||)
gudigona ninnābĕ kuṁkumagubbala nŏtti -
nadi nīmenibai guṟudaivunnadā
vadalaga pūm̐dom̐ṭalo vasaṁtamulāḍinadi
podali yāvinoda mĕppuḍu nĕṁchugŏṁduvā

(||emi||)
nĕṭṭana nalamel‌maṁga nīgu legalaṁpinadi
guṭṭudoḍane saduvu kŏṁṭivā nīvu
suṭṭamavai yelidivi sūsi yībĕ nīdo navvĕ
paṭṭabu śhrīveṁkaḍeśha bhāviṁchugŏṁduvā