Emi sesugomtiro imdaamkaa meeru

ఏమి సేసుకొంటిరో ఇందాఁకా మీరు
Language

(॥పల్లవి॥)
ఏమి సేసుకొంటిరో ఇందాఁకా మీరు
ఆముకొని మిమ్ము నేము అడుగ సిగ్గయ్యీని

(॥ఏమి॥)
కొమ్మకొప్పులోనున్నగొజ్జఁగరేకులచోప్పు
వుమ్మడి నీమేనిమీఁద నున్న దిదిగో
కమ్మటి నాపె గుబ్బలకస్తూరి గందము
దుమ్మురేఁగి పచ్చడానఁ దొప్పఁదోఁగివున్నది

(॥ఏమి॥)
సతిచెవులఁ బెట్టినజవ్వాదికరఁగులు
మితిమీరి నీబుజాలమీఁద నున్నవి
తతి నాపె పెదవులతములపుఁ జెదరులు
కతలుగా నీచెక్కులఁ గానుపించెను

(॥ఏమి॥)
అలమేలుమంగపాదాలందులలత్తుకరేక
మెలుపున నీనొసలిమీఁద నిండెను
యెలమి శ్రీవేంకటేశ ఇంతలో నన్నేలితివి
తోలుతనే యాపెగుఱుతులు ధరించితివి

(||pallavi||)
emi sesugŏṁṭiro iṁdām̐kā mīru
āmugŏni mimmu nemu aḍuga siggayyīni

(||emi||)
kŏmmagŏppulonunnagŏjjam̐garegulasoppu
vummaḍi nīmenimīm̐da nunna didigo
kammaḍi nābĕ gubbalagastūri gaṁdamu
dummurem̐gi pachchaḍānam̐ dŏppam̐dom̐givunnadi

(||emi||)
sadisĕvulam̐ bĕṭṭinajavvādigaram̐gulu
midimīri nībujālamīm̐da nunnavi
tadi nābĕ pĕdavuladamulabum̐ jĕdarulu
kadalugā nīsĕkkulam̐ gānubiṁchĕnu

(||emi||)
alamelumaṁgabādālaṁdulalattugarega
mĕlubuna nīnŏsalimīm̐da niṁḍĕnu
yĕlami śhrīveṁkaḍeśha iṁtalo nannelidivi
toludane yābĕguṟudulu dhariṁchidivi