ఏమి సేసినాఁ జెలుల కిన్నియు నమరుఁగాక
(॥పల్లవి॥)
ఏమి సేసినాఁ జెలుల కిన్నియు నమరుఁగాక
కోమలి వేడుక లెన్ని కూడపోసేవయ్యా
(॥ఏమి॥)
వుప్పతిల్లు గన్ను చూపు వొడ్డించుకోవచ్చునా
ముప్పిరిగొన్న నవ్వులు ముయ్యవచ్చునా
చెప్పరాని మాటలకు చెవులొగ్గవచ్చునా
కప్పరగంది నెంత గరిసించేవయ్యా
(॥ఏమి॥)
వుడివోని చుట్టరికా లొద్దనఁగవచ్చునా
తడఁ బడే తమకము దాఁచవచ్చునా
జడిగొన్న వలపుల చవుక సేయవచ్చునా
పడఁతితో నిఁక నెంత పంతమాడేవయ్యా
(॥ఏమి॥)
వులివచ్చి చెనకుల కోపననవచ్చునా
బలిమిఁ గూడితి విఁకఁ బాయవచ్చునా
యెలమి శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
జలజాక్షి నిఁక నెంత సాదించేవయ్యా
(||pallavi||)
emi sesinām̐ jĕlula kinniyu namarum̐gāga
komali veḍuga lĕnni kūḍabosevayyā
(||emi||)
vuppadillu gannu sūbu vŏḍḍiṁchugovachchunā
muppirigŏnna navvulu muyyavachchunā
sĕpparāni māḍalagu sĕvulŏggavachchunā
kapparagaṁdi nĕṁta garisiṁchevayyā
(||emi||)
vuḍivoni suṭṭarigā lŏddanam̐gavachchunā
taḍam̐ baḍe tamagamu dām̐savachchunā
jaḍigŏnna valabula savuga seyavachchunā
paḍam̐tido nim̐ka nĕṁta paṁtamāḍevayyā
(||emi||)
vulivachchi sĕnagula kobananavachchunā
balimim̐ gūḍidi vim̐kam̐ bāyavachchunā
yĕlami śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
jalajākṣhi nim̐ka nĕṁta sādiṁchevayyā