ఏమి సేసినాఁ జెల్లురా యీవేళ నీకు
(॥పల్లవి॥)
ఏమి సేసినాఁ జెల్లురా యీవేళ నీకు
కామించి నీకుఁగా నేను కడు వలచితిరా
(॥ఏమి॥)
వొల్లనివాఁడ వై వుండీ వొక్కొక్క నెపము వేసి
కల్లయలుకలు గాఁ గాటారించేవు
చెల్లు లేరా నీకు నిది సేన సతులు గలరు
వెల్లవిరి నొక్కతెనె వెఱ్ఱి నైతి నేనరా
(॥ఏమి॥)
యెందు వోఁ దలఁచితివో యెదో పని గడించుక
విందువలెఁ బోయే నంటా వేగిరించేవు
నింద లేదురా నీకును నీ విట్టె మగవాఁడవు
అంది పొంది నేనె నీకు ఆల నైతిఁ గదారా
(॥ఏమి॥)
చేరి నన్ను భ్రమించి నాచిత్తము చూడ వలసి
వారి వీరిఁ జూపి నాకు వాసి రేఁచేవు
యేర శ్రీవెంకటేశుఁడ యిట్టె నన్నుఁ గూడితివి
ధారుణి నీ రప మాయ తగు లైతిఁ గదరా
(||pallavi||)
emi sesinām̐ jĕllurā yīveḽa nīgu
kāmiṁchi nīgum̐gā nenu kaḍu valasidirā
(||emi||)
vŏllanivām̐ḍa vai vuṁḍī vŏkkŏkka nĕbamu vesi
kallayalugalu gām̐ gāḍāriṁchevu
sĕllu lerā nīgu nidi sena sadulu galaru
vĕllaviri nŏkkadĕnĕ vĕṭri naidi nenarā
(||emi||)
yĕṁdu vom̐ dalam̐sidivo yĕdo pani gaḍiṁchuga
viṁduvalĕm̐ boye naṁṭā vegiriṁchevu
niṁda ledurā nīgunu nī viṭṭĕ magavām̐ḍavu
aṁdi pŏṁdi nenĕ nīgu āla naidim̐ gadārā
(||emi||)
seri nannu bhramiṁchi nāsittamu sūḍa valasi
vāri vīrim̐ jūbi nāgu vāsi rem̐sevu
yera śhrīvĕṁkaḍeśhum̐ḍa yiṭṭĕ nannum̐ gūḍidivi
dhāruṇi nī raba māya tagu laidim̐ gadarā