Emi sesinaam jellunu yidivela

ఏమి సేసినాఁ జెల్లును యిదివేళ
Language

(॥పల్లవి॥)
ఏమి సేసినాఁ జెల్లును యిదివేళ
చే ముట్టి యాతనికే సేవలెల్లాఁ జేయవే

(॥॥)
నాటుకొనె చూపులు నడుమఁ గొలువులోన
గాఁటపు రమణునికి కానికియ్యవే
వాఁటమాయ చెమటలు వలపు లినుమడాయ
మాటలాడి యీతని మర్మము లంటించవే

(॥॥)
తలకొనె నగవులు దండనుండి చెవిలోన
వెలయ రమణునికే విన్నవించవే
చలివాసె మనసుకు చనవులు తుదముట్టె
తెలిపి యీతనికి నీ తేనెమోవొసగవే

(॥॥)
నెట్టుకొనె వేడుకలు నేఁడు శ్రీ వేంకటేశుకు
గట్టిఁగా బెండ్లాడితివి కాఁగిలియ్యవే
దట్టమాయ తమకము తగులాయ నిద్దరికి
చుట్టమవై యీతనికి సొమ్ములెల్లా నించవే

(||pallavi||)
emi sesinām̐ jĕllunu yidiveḽa
se muṭṭi yādanige sevalĕllām̐ jeyave

(||||)
nāḍugŏnĕ sūbulu naḍumam̐ gŏluvulona
gām̐ṭabu ramaṇunigi kānigiyyave
vām̐ṭamāya sĕmaḍalu valabu linumaḍāya
māḍalāḍi yīdani marmamu laṁṭiṁchave

(||||)
talagŏnĕ nagavulu daṁḍanuṁḍi sĕvilona
vĕlaya ramaṇunige vinnaviṁchave
salivāsĕ manasugu sanavulu tudamuṭṭĕ
tĕlibi yīdanigi nī tenĕmovŏsagave

(||||)
nĕṭṭugŏnĕ veḍugalu nem̐ḍu śhrī veṁkaḍeśhugu
gaṭṭim̐gā bĕṁḍlāḍidivi kām̐giliyyave
daṭṭamāya tamagamu tagulāya niddarigi
suṭṭamavai yīdanigi sŏmmulĕllā niṁchave