Emi sesinaam danado neggu pattenaa

ఏమి సేసినాఁ దనతో నెగ్గు పట్టేనా
Language

(॥పల్లవి॥)
ఏమి సేసినాఁ దనతో నెగ్గు పట్టేనా
చే ముట్టి బుజ్జగించినా సిగ్గువడీఁ జూడరే

(॥ఏమి॥)
వినయాన వేఁడుకొంటి విందుగా మోవి చూపితి
పెనఁగి చేతులువట్టి పిలిచితి
ఘనుఁడు తనచేఁతలు కంటినంటా నే నెంత
చెనకినా మొగమోడి సిగ్గువడీఁ జూడరే

(॥ఏమి॥)
ముమ్మారు నాన వెట్టితి మొక్కితిఁ బాదాలకు
నమ్మించితి ననుపుగా నవ్వు నవ్వితి
పమ్మి తన గురుతులు పట్టి యడిగితినంటా
చిమ్మిరేఁగి లోలోనే సిగ్గువడీఁ జూడరే

(॥ఏమి॥)
కప్పితిఁ బయ్యదకొంగు కాఁగిలించుకొంటిని
తెప్పలుగా రతులనుఁ దేలించితి
అప్పఁడు శ్రీవేంకటేశుఁ డాసుద్ది దడవేనంటా
చిప్పిలుఁ జెమటతోడ సిగ్గువడీఁ జూడరే

(||pallavi||)
emi sesinām̐ danado nĕggu paṭṭenā
se muṭṭi bujjagiṁchinā sigguvaḍīm̐ jūḍare

(||emi||)
vinayāna vem̐ḍugŏṁṭi viṁdugā movi sūbidi
pĕnam̐gi seduluvaṭṭi pilisidi
ghanum̐ḍu tanasem̐talu kaṁṭinaṁṭā ne nĕṁta
sĕnaginā mŏgamoḍi sigguvaḍīm̐ jūḍare

(||emi||)
mummāru nāna vĕṭṭidi mŏkkidim̐ bādālagu
nammiṁchidi nanubugā navvu navvidi
pammi tana gurudulu paṭṭi yaḍigidinaṁṭā
simmirem̐gi lolone sigguvaḍīm̐ jūḍare

(||emi||)
kappidim̐ bayyadagŏṁgu kām̐giliṁchugŏṁṭini
tĕppalugā radulanum̐ deliṁchidi
appam̐ḍu śhrīveṁkaḍeśhum̐ ḍāsuddi daḍavenaṁṭā
sippilum̐ jĕmaḍadoḍa sigguvaḍīm̐ jūḍare