Emi sesinaam dagu itte neegunu

ఏమి సేసినాఁ దగు ఇట్టె నీకును
Language

(॥పల్లవి॥)
ఏమి సేసినాఁ దగు ఇట్టె నీకును
కామినులైతేఁ జాలు కైకొలుప వత్తురు

(॥ఏమి॥)
చెల్లుబడిగా సుద్దులు చెలులతోఁ జెప్పేవు
కల్లలై ననీమాటలు కాదనేరా
మల్లాడి అలిగినమావంటి వారినైతే
వల్లదాన నిట్టె వొడఁబరతురుగాక

(॥ఏమి॥)
అందాలుగానిపనులు అమరించే వప్పటిని
పొందుగా నీచేఁతలు పోఁదొసేరా
సందడిలోఁ జెనకినసరసపుమమ్మునైతే
యిందమని పంతములు ఇప్పింతుగాక

(॥ఏమి॥)
తగనంటా నీమేలే తారుకాణించే విదిగో
వెగటని నీవిద్యలు విచారించేలా
అగపడి శ్రీవేంకటాధీశ కూడితివి
మొగమోడేమాచేతనే మొక్కింతురుగాక

(||pallavi||)
emi sesinām̐ dagu iṭṭĕ nīgunu
kāminulaidem̐ jālu kaigŏluba vatturu

(||emi||)
sĕllubaḍigā suddulu sĕluladom̐ jĕppevu
kallalai nanīmāḍalu kādanerā
mallāḍi aliginamāvaṁṭi vārinaide
valladāna niṭṭĕ vŏḍam̐baradurugāga

(||emi||)
aṁdālugānibanulu amariṁche vappaḍini
pŏṁdugā nīsem̐talu pom̐dŏserā
saṁdaḍilom̐ jĕnaginasarasabumammunaide
yiṁdamani paṁtamulu ippiṁtugāga

(||emi||)
taganaṁṭā nīmele tārugāṇiṁche vidigo
vĕgaḍani nīvidyalu visāriṁchelā
agabaḍi śhrīveṁkaḍādhīśha kūḍidivi
mŏgamoḍemāsedane mŏkkiṁturugāga