ఏమి సేసినా నీకు యెదురు విన్నవించము
(॥పల్లవి॥)
ఏమి సేసినా నీకు యెదురు విన్నవించము
కామించి మమ్ము మన్నించు కైవశపువాఁడవు
(॥ఏమి॥)
కారణములేనిమాట కడు నాతో నాడేవు
వూరకే, నామనసైతే వొడఁబడదు
ఆరితేరెఁ బనులు నీయంకె కెల్లా వచ్చితిని
దూరు నీపై వేసుకోకు దొడ్డవాఁడవు
(॥ఏమి॥)
పనిలేని సరసాలు పై పైనే నెరపేవు
ననిచి, నా సెలవుల నగవు రాదు
చనవులు సరివచ్చె సతమై వున్నారము
నిను మోవఁజేసుకోకు నిజాలవాఁడవు
(॥ఏమి॥)
చెప్పరాని సిగ్గులెల్లా సెలవుల ముంచేవు
దప్పిదేరి యందువంకఁ దమకించను
అప్పుడే శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
దెప్పరానఁ గూడితివి దీమసపు వాఁడవు
(||pallavi||)
emi sesinā nīgu yĕduru vinnaviṁchamu
kāmiṁchi mammu manniṁchu kaivaśhabuvām̐ḍavu
(||emi||)
kāraṇamulenimāḍa kaḍu nādo nāḍevu
vūrage, nāmanasaide vŏḍam̐baḍadu
āriderĕm̐ banulu nīyaṁkĕ kĕllā vachchidini
dūru nībai vesugogu dŏḍḍavām̐ḍavu
(||emi||)
panileni sarasālu pai paine nĕrabevu
nanisi, nā sĕlavula nagavu rādu
sanavulu sarivachchĕ sadamai vunnāramu
ninu movam̐jesugogu nijālavām̐ḍavu
(||emi||)
sĕpparāni siggulĕllā sĕlavula muṁchevu
dappideri yaṁduvaṁkam̐ damagiṁchanu
appuḍe śhrī veṁkaḍeśha alamelumaṁga nenu
dĕpparānam̐ gūḍidivi dīmasabu vām̐ḍavu