Emi sesinaa needo neduraademaa

ఏమి సేసినా నీతో నెదురాడేమా
Language

(॥పల్లవి॥)
ఏమి సేసినా నీతో నెదురాడేమా
ప్రేమపువారము నీతోఁ బెనఁగితే నేమో

(॥ఏమి॥)
సంగతాయఁ బనులు నీచనవు గలుగఁగాను
కంగుదేరి సవతులు కైవసమైరి
కొంగువట్టి తీసి మము గొరబు సేయకు మిఁక
యెంగిలివారము నీకు నేడనున్నా నేమూ

(॥ఏమి॥)
వేడుక లన్నియుఁ దేరె విచ్చేసి నీ వుండఁగాను
కూడేటికోరిక లెల్లఁ గొనసాగెను
వీడె మిచ్చి మాసిగ్గు విడిపించ కంతలోనే
వూడిగము వారము నీ కొరసితే నేము

(॥ఏమి॥)
మనసెల్ల నొక్కటాయ మన్నించి నన్నుఁ గూడఁగ
కొనమొదలికి నిది గురుతాయను
ఘనుఁడ శ్రీవేంకటేశ గక్కన నవ్వేవు నేఁడె
ననుపువారము నీకు నానాఁడే నానాఁడే నేమూ

(||pallavi||)
emi sesinā nīdo nĕdurāḍemā
premabuvāramu nīdom̐ bĕnam̐gide nemo

(||emi||)
saṁgadāyam̐ banulu nīsanavu galugam̐gānu
kaṁguderi savadulu kaivasamairi
kŏṁguvaṭṭi tīsi mamu gŏrabu seyagu mim̐ka
yĕṁgilivāramu nīgu neḍanunnā nemū

(||emi||)
veḍuga lanniyum̐ derĕ vichchesi nī vuṁḍam̐gānu
kūḍeḍigoriga lĕllam̐ gŏnasāgĕnu
vīḍĕ michchi māsiggu viḍibiṁcha kaṁtalone
vūḍigamu vāramu nī kŏraside nemu

(||emi||)
manasĕlla nŏkkaḍāya manniṁchi nannum̐ gūḍam̐ga
kŏnamŏdaligi nidi gurudāyanu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha gakkana navvevu nem̐ḍĕ
nanubuvāramu nīgu nānām̐ḍe nānām̐ḍe nemū