Emi sesinaa nee sitta mimte kaaga

ఏమి సేసినా నీ చిత్త మింతే కాక
Language

(॥పల్లవి॥)
ఏమి సేసినా నీ చిత్త మింతే కాక
కాముకుఁ డైన నిన్నుఁ గా దనేటివారమా

(॥ఏమి॥)
నేరిచినవారుగా నీతో మాటాడేది వే
మారును నెదు రాడఁగ మా కేటికి
కారణము గలిగి కా కమ్మర నీతో నవ్వేది
యీరీతి నీతోఁ గెలయ నెంత పని మాకును

(॥ఏమి॥)
అంత కోపినప్పుడుగా నట్టె నిన్ను దగ్గరేది
మంతనాలు విన్నవించ మా కేఁటికి
పంతము నే నాడితేఁగా బలవు నీతోఁ జూపేది
యెంత కెంత నీసుద్దులు యేమి పని మాకునూ

(॥ఏమి॥)
నేనే నీ వయితేంగా నిజ మని నమ్మేది
మానక వావులు చెప్ప మా కేఁటికి
పూనుక శ్రీవెంకటేశ బుజ్జగించి కూడితివి
యే నెపాలకు నింక నేమి పని మాకును

(||pallavi||)
emi sesinā nī sitta miṁte kāga
kāmugum̐ ḍaina ninnum̐ gā daneḍivāramā

(||emi||)
nerisinavārugā nīdo māḍāḍedi ve
mārunu nĕdu rāḍam̐ga mā keḍigi
kāraṇamu galigi kā kammara nīdo navvedi
yīrīdi nīdom̐ gĕlaya nĕṁta pani māgunu

(||emi||)
aṁta kobinappuḍugā naṭṭĕ ninnu daggaredi
maṁtanālu vinnaviṁcha mā kem̐ṭigi
paṁtamu ne nāḍidem̐gā balavu nīdom̐ jūbedi
yĕṁta kĕṁta nīsuddulu yemi pani māgunū

(||emi||)
nene nī vayideṁgā nija mani nammedi
mānaga vāvulu sĕppa mā kem̐ṭigi
pūnuga śhrīvĕṁkaḍeśha bujjagiṁchi kūḍidivi
ye nĕbālagu niṁka nemi pani māgunu