Emi sesidivogaani imtini neevu

ఏమి సేసితివోకాని ఇంతిని నీవు
Language

(॥పల్లవి॥)
ఏమి సేసితివోకాని ఇంతిని నీవు
చే ముట్టక పువ్వులచెండున వేసీని

(॥ఏమి॥)
ముక్కర గదలఁగాను ముసిముసినవ్వు నవ్వి
చెక్కుచేతితో చెలి సిగ్గువడీని
చుక్కబొట్టువెట్టినకస్తూరిబేంట్లు రాలఁగా
చక్కనినిన్ను బొమ్మల జంకించీని

(॥ఏమి॥)
మించులమొగపుతీగె మెఱవఁగా మళ్లిచూచి
అంచె నిన్నుఁగని శిరసటు వంచీని
కంచపుమోవితేనె కడు నుట్టిపడఁగాను
పెంచి వలపుల నీతో బీరములాడీని

(॥ఏమి॥)
కంకణా గల్లనఁగా గక్కనఁ బాదాలొత్తి
పొంకముగాఁ గూడి గొబ్బున మెచ్చీని
అంకెల శ్రీవేంకటేశ అలమేలుమంగ యీకె
కుంకుమచెమటలెల్లాఁ గురిసీ నీపైని

(||pallavi||)
emi sesidivogāni iṁtini nīvu
se muṭṭaga puvvulasĕṁḍuna vesīni

(||emi||)
mukkara gadalam̐gānu musimusinavvu navvi
sĕkkusedido sĕli sigguvaḍīni
sukkabŏṭṭuvĕṭṭinagastūribeṁṭlu rālam̐gā
sakkanininnu bŏmmala jaṁkiṁchīni

(||emi||)
miṁchulamŏgabudīgĕ mĕṟavam̐gā maḽlisūsi
aṁchĕ ninnum̐gani śhirasaḍu vaṁchīni
kaṁchabumovidenĕ kaḍu nuṭṭibaḍam̐gānu
pĕṁchi valabula nīdo bīramulāḍīni

(||emi||)
kaṁkaṇā gallanam̐gā gakkanam̐ bādālŏtti
pŏṁkamugām̐ gūḍi gŏbbuna mĕchchīni
aṁkĕla śhrīveṁkaḍeśha alamelumaṁga yīgĕ
kuṁkumasĕmaḍalĕllām̐ gurisī nībaini