Emi sesidivo yimtini | nee

ఏమి సేసితివో యింతిని । నీ
Language

(॥పల్లవి॥)
ఏమి సేసితివో యింతిని । నీ-
మోము చూచి చూచి మొక్కీనదె

(॥ఏమి॥)
చెక్కులకాంతులు చెదరఁగా
నక్కువడఁ జెలి నవ్వీనదె
ముక్కున నూర్పులు మొరయఁగా
సొక్కుచు సోలుచుఁ జూచీనదె

(॥ఏమి॥)
చెమట నీపైఁ జిప్పిలఁగా
కొమరె సిగ్గునఁ గొంకీనదె
వుమురుఁగు చాలవొత్తులు
గములపయ్యదఁ గప్పీనదె

(॥ఏమి॥)
వొగిఁ దమకము లొలుకఁగా
చిగురుఁదేనెలు చిందీనదె
నగు శ్రీవేంకటనాయకుఁడా నీవు
తగఁ గూడినవి తలఁచీనదె

(||pallavi||)
emi sesidivo yiṁtini | nī-
momu sūsi sūsi mŏkkīnadĕ

(||emi||)
sĕkkulagāṁtulu sĕdaram̐gā
nakkuvaḍam̐ jĕli navvīnadĕ
mukkuna nūrbulu mŏrayam̐gā
sŏkkusu solusum̐ jūsīnadĕ

(||emi||)
sĕmaḍa nībaim̐ jippilam̐gā
kŏmarĕ siggunam̐ gŏṁkīnadĕ
vumurum̐gu sālavŏttulu
gamulabayyadam̐ gappīnadĕ

(||emi||)
vŏgim̐ damagamu lŏlugam̐gā
sigurum̐denĕlu siṁdīnadĕ
nagu śhrīveṁkaḍanāyagum̐ḍā nīvu
tagam̐ gūḍinavi talam̐sīnadĕ