Emi sesidivo yayya yimdum gaani poddu vodaa

ఏమి సేసితివో యయ్య యిందుఁ గాని పొద్దు వోదా
Language

(॥పల్లవి॥)
ఏమి సేసితివో యయ్య యిందుఁ గాని పొద్దు వోదా
రామను వేఁడుకొందువు రావయ్య లోనికి

(॥ఏమి॥)
వుండుండి దిగ్గన లేచి వువిద లోని కేఁగి
పండఁబదె చింతతోడ పానుపుమీఁద
అండనే మేనిసొమ్ములు అవే పెట్టెలోనఁ బెట్టి
చండి సేసి యడిగిన చక్క మాకుఁ జెప్పదు

(॥ఏమి॥)
అప్పటి నంతటఁ బోక అంగన తెరలోనుండి
విప్పచు నీపచ్చడము వెలివేసెను
తొప్పుఁ దోఁగేఁ జెమటక కస్తూరిబొట్టు పట్టుగాఁగ
యిప్పుడే తా దిద్దుకొని యేఁటి కన్నా మానదు

(॥ఏమి॥)
నీ వింతలో మొక్కఁ గాను నెలఁత చిఱునవ్వుతో
సేవచేసి కౌఁగిలించె శ్రీవేంకటేశా
వేవేలు వచ్చెఁ గోపము వేగిరమే తీరె మీకు
దేవరలే మీరిద్దరు దిష్టమాయ మాకును

(||pallavi||)
emi sesidivo yayya yiṁdum̐ gāni pŏddu vodā
rāmanu vem̐ḍugŏṁduvu rāvayya lonigi

(||emi||)
vuṁḍuṁḍi diggana lesi vuvida loni kem̐gi
paṁḍam̐badĕ siṁtadoḍa pānubumīm̐da
aṁḍane menisŏmmulu ave pĕṭṭĕlonam̐ bĕṭṭi
saṁḍi sesi yaḍigina sakka māgum̐ jĕppadu

(||emi||)
appaḍi naṁtaḍam̐ boga aṁgana tĕralonuṁḍi
vippasu nībachchaḍamu vĕlivesĕnu
tŏppum̐ dom̐gem̐ jĕmaḍaga kastūribŏṭṭu paṭṭugām̐ga
yippuḍe tā diddugŏni yem̐ṭi kannā mānadu

(||emi||)
nī viṁtalo mŏkkam̐ gānu nĕlam̐ta siṟunavvudo
sevasesi kaum̐giliṁchĕ śhrīveṁkaḍeśhā
vevelu vachchĕm̐ gobamu vegirame tīrĕ mīgu
devarale mīriddaru diṣhṭamāya māgunu