ఏమి సేసితివో చెలి ఇంత నీకు మోహించె
(॥పల్లవి॥)
ఏమి సేసితివో చెలి ఇంత నీకు మోహించె
చూమరసేయక ఇంతిఁ జూతువు రావయ్యా
(॥ఏమి॥)
వనిత చెక్కిటిచేత వలపులు దొంతివెట్టె
వొనరఁగ నాసలకు వొడిగట్టెను
తనివోని మంతనాల తమకము వెదవెట్టె
జునుగక రమణినిఁ జూతువు రావయ్యా
(॥ఏమి॥)
పక్కనఁ దలపోఁతల బయలువందిలి వెట్టె
చిక్కని చిరుసిగ్గునఁ జీరగట్టె
వొక్కలపుఁ గోరికల ముసుఁగు నిండాఁ బెట్టె
చొక్కముగ జవరాలిఁ జూతువు రావయ్యా
(॥ఏమి॥)
వసివాఁడుమోవి దేనె వైపుగానే వడివెట్టె
కొసరుచు గుట్టుననే గోడవెట్టె
యెసగ శ్రీ వేంకటేశ యేలితి వలమేల్మంగను
సుసరానఁ జెలినేర్పు చూతువురావయ్యా
(||pallavi||)
emi sesidivo sĕli iṁta nīgu mohiṁchĕ
sūmaraseyaga iṁtim̐ jūduvu rāvayyā
(||emi||)
vanida sĕkkiḍiseda valabulu dŏṁtivĕṭṭĕ
vŏnaram̐ga nāsalagu vŏḍigaṭṭĕnu
tanivoni maṁtanāla tamagamu vĕdavĕṭṭĕ
junugaga ramaṇinim̐ jūduvu rāvayyā
(||emi||)
pakkanam̐ dalabom̐tala bayaluvaṁdili vĕṭṭĕ
sikkani sirusiggunam̐ jīragaṭṭĕ
vŏkkalabum̐ gorigala musum̐gu niṁḍām̐ bĕṭṭĕ
sŏkkamuga javarālim̐ jūduvu rāvayyā
(||emi||)
vasivām̐ḍumovi denĕ vaibugāne vaḍivĕṭṭĕ
kŏsarusu guṭṭunane goḍavĕṭṭĕ
yĕsaga śhrī veṁkaḍeśha yelidi valamelmaṁganu
susarānam̐ jĕlinerbu sūduvurāvayyā