ఏమి సేసితివో నీవే యెరుఁగుదువు
(॥పల్లవి॥)
ఏమి సేసితివో నీవే యెరుఁగుదువు
ఆ మాటే యింకొక్కమాటు అడుగఁగ రాదా
(॥ఏమి॥)
మొగము దప్పక చూచి మోనమునఁ దలవంచె
నగదాయ నేమోకాని నాధుఁడ నిన్ను
తెగ దెంతైనా మాట తెలియరాదెవ్వరికి
జగడముఁ గానరాదు సమ్మతించలేదు
(॥ఏమి॥)
కదిసి వద్దఁ గూచుండి కాంత యెవ్వలిమోమై
యదన విడె మీదాయ నదేమోకానీ
వెదకినఁ గానరాదు వేవేగ నీ గుట్టు
చెదరినచిత్తమో సిగ్గో తెలియదు
(॥ఏమి॥)
నీ మీఁదఁ జెయి వేసి నెలఁత గొబ్బనఁ దీసె
యేమి దలఁచెనో కాని ఇంతటిలోన
కామించి శ్రీ వేంకటేశ కలసితి వటునీవు
యీమగువ, నీ వలపులెట్టుండెనో కానీ
(||pallavi||)
emi sesidivo nīve yĕrum̐guduvu
ā māḍe yiṁkŏkkamāḍu aḍugam̐ga rādā
(||emi||)
mŏgamu dappaga sūsi monamunam̐ dalavaṁchĕ
nagadāya nemogāni nādhum̐ḍa ninnu
tĕga dĕṁtainā māḍa tĕliyarādĕvvarigi
jagaḍamum̐ gānarādu sammadiṁchaledu
(||emi||)
kadisi vaddam̐ gūsuṁḍi kāṁta yĕvvalimomai
yadana viḍĕ mīdāya nademogānī
vĕdaginam̐ gānarādu vevega nī guṭṭu
sĕdarinasittamo siggo tĕliyadu
(||emi||)
nī mīm̐dam̐ jĕyi vesi nĕlam̐ta gŏbbanam̐ dīsĕ
yemi dalam̐sĕno kāni iṁtaḍilona
kāmiṁchi śhrī veṁkaḍeśha kalasidi vaḍunīvu
yīmaguva, nī valabulĕṭṭuṁḍĕno kānī