Emi sesidivo kaani yimtigi neevu

ఏమి సేసితివో కాని యింతికి నీవు
Language

(॥పల్లవి॥)
ఏమి సేసితివో కాని యింతికి నీవు
గామిడినేఁతల నీపె గాత సేసీనోయీ

(॥॥)
పలచగా నవ్వి నీతో పంతములాడుకొంటాను
చెలి యున్న భావము చూచితివా వోయి
తలకొన్న చెలులను తగవులు చెప్పుమని
సొలసీని పలుమారు చూచితివా వోయీ

(॥॥)
వోరచూపులు చూచి వొట్టువెట్టుకొంటాను
జీరలు దీసినది చూచితివా వోయి
కేరడపు సేఁతలను కేకరించి ననుపులు
జోరునఁ జెమట గారీఁ జూచితివా వోయి

(॥॥)
చిక్కని చన్నులనొత్తి చేరి కాఁగిలించుకొంటా
చెక్కునొక్కీ నిన్నిట్టే చూచితివా వోయి
యిక్కువతో శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
చొక్కించి నిన్నా కె మెచ్చీఁజూచితివా వోయీ

(||pallavi||)
emi sesidivo kāni yiṁtigi nīvu
gāmiḍinem̐tala nībĕ gāda sesīnoyī

(||||)
palasagā navvi nīdo paṁtamulāḍugŏṁṭānu
sĕli yunna bhāvamu sūsidivā voyi
talagŏnna sĕlulanu tagavulu sĕppumani
sŏlasīni palumāru sūsidivā voyī

(||||)
vorasūbulu sūsi vŏṭṭuvĕṭṭugŏṁṭānu
jīralu dīsinadi sūsidivā voyi
keraḍabu sem̐talanu kegariṁchi nanubulu
jorunam̐ jĕmaḍa gārīm̐ jūsidivā voyi

(||||)
sikkani sannulanŏtti seri kām̐giliṁchugŏṁṭā
sĕkkunŏkkī ninniṭṭe sūsidivā voyi
yikkuvado śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
sŏkkiṁchi ninnā kĕ mĕchchīm̐jūsidivā voyī