Emi sesidinayya neevimta yagadu sesevu

ఏమి సేసితినయ్య నీవింత యగడు సేసేవు
Language

(॥పల్లవి॥)
ఏమి సేసితినయ్య నీవింత యగడు సేసేవు
ఆమని వలపులెల్లా నంగడి వేసేవు

(॥ఏమి॥)
నవ్వులకు నీతోడు నంటుమాఁట లాడితేను
రవ్వగాఁ జెప్పేవు తోడిరమణులతో
వువ్విళ్లూర నీమోవి నూరేతేనె లానితేను
అవ్వల నాపలుసోఁకులని చూపేవు

(॥ఏమి॥)
పూని యెఱుకకుఁ జేయి బుజముపై వేసితేను
మేనుగోరుసోఁకెనంటా మిట్టిపడేవు
దాని కేమనుచు నిన్నుఁ దప్పకచూచితేను
వేనిపట్టి సిగ్గులతో బెట్టి నవ్వేవు

(॥ఏమి॥)
కడుమెరమెచ్చులకుకాఁగిలంచుకొంటేను
అడపముసతివిడె మందిమ్మ నేవు
యెడయక శ్రీవేంకటేశ నీకుమొక్కితేను
తొడిఁబడఁ దెరవేసి దొమ్మిసేసేవు

(||pallavi||)
emi sesidinayya nīviṁta yagaḍu sesevu
āmani valabulĕllā naṁgaḍi vesevu

(||emi||)
navvulagu nīdoḍu naṁṭumām̐ṭa lāḍidenu
ravvagām̐ jĕppevu toḍiramaṇulado
vuvviḽlūra nīmovi nūredenĕ lānidenu
avvala nābalusom̐kulani sūbevu

(||emi||)
pūni yĕṟugagum̐ jeyi bujamubai vesidenu
menugorusom̐kĕnaṁṭā miṭṭibaḍevu
dāni kemanusu ninnum̐ dappagasūsidenu
venibaṭṭi siggulado bĕṭṭi navvevu

(||emi||)
kaḍumĕramĕchchulagugām̐gilaṁchugŏṁṭenu
aḍabamusadiviḍĕ maṁdimma nevu
yĕḍayaga śhrīveṁkaḍeśha nīgumŏkkidenu
tŏḍim̐baḍam̐ dĕravesi dŏmmisesevu