Emi sesidi vimdaamkaa neda numtivi

ఏమి సేసితి విందాఁకా నేడ నుంటివి
Language

(॥పల్లవి॥)
ఏమి సేసితి విందాఁకా నేడ నుంటివి
చే ముంచి యాపెను నీవే సేద దేర్చవయ్యా

(॥ఏమి॥)
యింతి నీవు వచ్చే వంటా నిందాఁకా నెదురు చూచె
అంతయు నీతోఁ గొంచి యాడఁ జాలదు
చింతతో నున్నది చెలి చెక్కు నొక్కి యీపెకు
సంతోసము సేసి మోవి చవి చూపవయ్యా

(॥ఏమి॥)
నీవే పిలిచే వంటా నిలుచుండె నిందాఁక
ఆవలిమాటలు నిన్ను ననఁ జాలదు
కోవరపుఁ దమకాన గుట్టుతో వున్నగి యీపెఁ
జే వట్టి బుజ్జగించి చిత్తగించవయ్యా

(॥ఏమి॥)
పవళించే వంటాను నీపైనే కన్ను లిందాఁకా
అవుఁ గా దనుచు నిన్ను ననఁ జాలదు
వివరించి కూడితి శ్రీవెంకటేశ యీసతిని
కవ వాయ కిట్లానె కైకొ నుండవయ్యా

(||pallavi||)
emi sesidi viṁdām̐kā neḍa nuṁṭivi
se muṁchi yābĕnu nīve seda dersavayyā

(||emi||)
yiṁti nīvu vachche vaṁṭā niṁdām̐kā nĕduru sūsĕ
aṁtayu nīdom̐ gŏṁchi yāḍam̐ jāladu
siṁtado nunnadi sĕli sĕkku nŏkki yībĕgu
saṁtosamu sesi movi savi sūbavayyā

(||emi||)
nīve pilise vaṁṭā nilusuṁḍĕ niṁdām̐ka
āvalimāḍalu ninnu nanam̐ jāladu
kovarabum̐ damagāna guṭṭudo vunnagi yībĕm̐
je vaṭṭi bujjagiṁchi sittagiṁchavayyā

(||emi||)
pavaḽiṁche vaṁṭānu nībaine kannu liṁdām̐kā
avum̐ gā danusu ninnu nanam̐ jāladu
vivariṁchi kūḍidi śhrīvĕṁkaḍeśha yīsadini
kava vāya kiṭlānĕ kaigŏ nuṁḍavayyā