Emi sesevogaani imkanu neesittamu

ఏమి సేసేవోకాని ఇఁకను నీచిత్తము
Language

(॥పల్లవి॥)
ఏమి సేసేవోకాని ఇఁకను నీచిత్తము
వేమారు సుద్దు లడిగీ వెలఁది యింటిలోను

(॥ఏమి॥)
ఆడుకోలునీమాఁట లాసలు వుట్టించఁగాను
వాడికె నెదురుచూచీ వనిత నీకు
పాడినపాట నీపే రప్పటిఁ దలఁపించఁగాను
జాడ నిన్నడుగనంపె సకియలచేతను

(॥ఏమి॥)
తాలిమితో నీగుణాలు తమకము రేఁచఁగాను
పోలించి పూవుల వేసీఁ బొలిఁతి నిన్ను
వేలనున్న వుంగరము వేడుకలు రేఁచఁగాను
కేలెత్తి నీకు మొక్కీఁ గెలనిసన్నలను

(॥ఏమి॥)
చుట్టరికపునీరాక సొంపు నిగిడించఁగాను
ఇట్టె నిన్నుఁగాఁగిలించీ నీకాంత నేఁడు
గట్టిగా శ్రీవేంకటేశ కలసి నీవుండఁగాను
నెట్టన నిన్నుఁ బొగడీ నెలఁతలలోను

(||pallavi||)
emi sesevogāni im̐kanu nīsittamu
vemāru suddu laḍigī vĕlam̐di yiṁṭilonu

(||emi||)
āḍugolunīmām̐ṭa lāsalu vuṭṭiṁcham̐gānu
vāḍigĕ nĕdurusūsī vanida nīgu
pāḍinabāḍa nībe rappaḍim̐ dalam̐piṁcham̐gānu
jāḍa ninnaḍuganaṁpĕ sagiyalasedanu

(||emi||)
tālimido nīguṇālu tamagamu rem̐sam̐gānu
poliṁchi pūvula vesīm̐ bŏlim̐ti ninnu
velanunna vuṁgaramu veḍugalu rem̐sam̐gānu
kelĕtti nīgu mŏkkīm̐ gĕlanisannalanu

(||emi||)
suṭṭarigabunīrāga sŏṁpu nigiḍiṁcham̐gānu
iṭṭĕ ninnum̐gām̐giliṁchī nīgāṁta nem̐ḍu
gaṭṭigā śhrīveṁkaḍeśha kalasi nīvuṁḍam̐gānu
nĕṭṭana ninnum̐ bŏgaḍī nĕlam̐talalonu