Emi sesevo sooda mimka meemdanu

ఏమి సేసేవో చూత మిఁక మీఁదను
Language

(॥పల్లవి॥)
ఏమి సేసేవో చూత మిఁక మీఁదను
వేమరు నీ మాయలనే వేగుఁబొద్దులాయను

(॥ఏమి॥)
యెదురు చూచేను మాయింటికి విచ్చేసేవంటా
అదన వేరొక తదే అట్టె యెదురు చూచీ
పొదిగిన మా యిద్దరికిఁ బొత్తల నీ వాడ నుంటే
యిదివో వలపు చల్లే వెరఁగనా నేను

(॥ఏమి॥)
పిలువ నంపితి నిన్నుఁబెడరేఁచి చెలిచేత
నిలిచి ఆపెయునొక్క నెలఁత నీకడ కంపె
చెలు లిద్దరిపై రెండుచేతులు వేసుక నీవు
యెలమి నవ్వులు నవ్వే వెఱఁగనా నేను

(॥ఏమి॥)
రమ్మని పిలువఁగాను రతికి నే దగ్గరితి
పిమ్మట నాపెయుఁదన్ను బిలిచే రనుచు వచ్చె
యిమ్ముల శ్రీవేంకటేశ యిద్దరిఁ గాఁగిటఁ గూడి
యెమ్మెలే నీ వింత సేసే వెరఁగనా నేను

(||pallavi||)
emi sesevo sūda mim̐ka mīm̐danu
vemaru nī māyalane vegum̐bŏddulāyanu

(||emi||)
yĕduru sūsenu māyiṁṭigi vichchesevaṁṭā
adana verŏga tade aṭṭĕ yĕduru sūsī
pŏdigina mā yiddarigim̐ bŏttala nī vāḍa nuṁṭe
yidivo valabu salle vĕram̐ganā nenu

(||emi||)
piluva naṁpidi ninnum̐bĕḍarem̐si sĕliseda
nilisi ābĕyunŏkka nĕlam̐ta nīgaḍa kaṁpĕ
sĕlu liddaribai rĕṁḍusedulu vesuga nīvu
yĕlami navvulu navve vĕṟam̐ganā nenu

(||emi||)
rammani piluvam̐gānu radigi ne daggaridi
pimmaḍa nābĕyum̐dannu bilise ranusu vachchĕ
yimmula śhrīveṁkaḍeśha yiddarim̐ gām̐giḍam̐ gūḍi
yĕmmĕle nī viṁta sese vĕram̐ganā nenu