Emi seseeno vibhumdu yedurusoose nenu

ఏమి సేసీనో విభుఁడు యెదురుచూచే నేను
Language

(॥పల్లవి॥)
ఏమి సేసీనో విభుఁడు యెదురుచూచే నేను
ప్రేమపు సంతోసాలు పెనగొనీ నాకును

(॥ఏమి॥)
మగఁడు దనతోడుత మాఁటనాడినట్టుండు
తగులు మనసులోనఁ దలపోసితే
నగినట్లలేవుండు ననుపెట్టిదోకాని
ఇగిరించీఁ గోరికలు యేమిసేతునే

(॥ఏమి॥)
తమితో నోక్కొకమాఁటు తప్పక చూచినట్టుఁడు
మమత నాపతిమీఁద మరిఁ బెట్టితే
అమరివుందుఁ గాఁగిట నాస యెట్టిదో కాని
తిమిరించీ వేడుకలు దీని కేమి సేతునే

(॥ఏమి॥)
పానుపుపై నాతోను పరగ నవ్వినట్టుండు
మేను మేను మోఁకెనని మెదలించితే
ఆనుక శ్రీవేంకటేశుఁ డంతలో వచ్చి నన్నేలె
యానిజ మిప్పుడే కంటి నింకా నేమిసేతునే

(||pallavi||)
emi sesīno vibhum̐ḍu yĕdurusūse nenu
premabu saṁtosālu pĕnagŏnī nāgunu

(||emi||)
magam̐ḍu danadoḍuda mām̐ṭanāḍinaṭṭuṁḍu
tagulu manasulonam̐ dalaboside
naginaṭlalevuṁḍu nanubĕṭṭidogāni
igiriṁchīm̐ gorigalu yemisedune

(||emi||)
tamido nokkŏgamām̐ṭu tappaga sūsinaṭṭum̐ḍu
mamada nābadimīm̐da marim̐ bĕṭṭide
amarivuṁdum̐ gām̐giḍa nāsa yĕṭṭido kāni
timiriṁchī veḍugalu dīni kemi sedune

(||emi||)
pānububai nādonu paraga navvinaṭṭuṁḍu
menu menu mom̐kĕnani mĕdaliṁchide
ānuga śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalo vachchi nannelĕ
yānija mippuḍe kaṁṭi niṁkā nemisedune