ఏమి సేసీనని నీవు యేలడిగేవు
(॥పల్లవి॥)
ఏమి సేసీనని నీవు యేలడిగేవు
కామించిన చెలి నిట్టె కరుణించు మిపుడు
(॥ఏమి॥)
నీమీఁదిచిత్తమున నిద్దుర కంటికిరాక
కోమలి కత చెప్పించుకొంటా నున్నది
దోమటితో మదనుని తుమ్మిదబలములకు
దామెనగాఁ గొప్పు విడిదల సేయుచున్నది
(॥ఏమి॥)
చెలుల నీకడకంపి చిమ్మేటి యాసలతోడ
కెలన నడిమి వాకిట నున్నది
పొలసి తన చూపులు పూవుల బాణములకు
బెళకులు లేకుండాఁ బెనఁబెట్టుకున్నది
(॥ఏమి॥)
దగ్గర నిన్ను రప్పించి తమకము రెట్టించఁగ
సిగ్గుతోడ విన్నపాలు సేయుచున్నది
యెగ్గుదీర శ్రీ వేంకటేశ నేఁడె కూడితివి
నిగ్గులను నవ్వుకొంటా నెలవున నున్నది
(||pallavi||)
emi sesīnani nīvu yelaḍigevu
kāmiṁchina sĕli niṭṭĕ karuṇiṁchu mibuḍu
(||emi||)
nīmīm̐disittamuna niddura kaṁṭigirāga
komali kada sĕppiṁchugŏṁṭā nunnadi
domaḍido madanuni tummidabalamulagu
dāmĕnagām̐ gŏppu viḍidala seyusunnadi
(||emi||)
sĕlula nīgaḍagaṁpi simmeḍi yāsaladoḍa
kĕlana naḍimi vāgiḍa nunnadi
pŏlasi tana sūbulu pūvula bāṇamulagu
bĕḽagulu leguṁḍām̐ bĕnam̐bĕṭṭugunnadi
(||emi||)
daggara ninnu rappiṁchi tamagamu rĕṭṭiṁcham̐ga
siggudoḍa vinnabālu seyusunnadi
yĕggudīra śhrī veṁkaḍeśha nem̐ḍĕ kūḍidivi
niggulanu navvugŏṁṭā nĕlavuna nunnadi