Emi sese vikkadanu yemtabani gaddu neegu

ఏమి సేసే విక్కడను యెంతపని గద్దు నీకు
Language

(॥పల్లవి॥)
ఏమి సేసే విక్కడను యెంతపని గద్దు నీకు
కోమలి నీ రాకలే కోరుకొని వున్నది

(॥ఏమి॥)
ఇచ్చకమాడేనని నీ కితవరి నయ్యేనని
కొచ్చి చెలులతో నెంచుకొంటా నున్నవి
ముచ్చటాడేనని సతి మోముచూచి మొక్కేనని
విచ్చేసే వాడకునని వేళగాచుకున్నది

(॥ఏమి॥)
చనవరినయ్యేనని సరసమాడేనని
మనసులో సంతోసించి మరిగున్నది
పెనఁగులాడేనని ప్రియములు చెప్పేనని
తనివోనిరతులకుఁ దమకించి వున్నది

(॥ఏమి॥)
చిత్తము దెలిసేనని చేకొని కూడెనని
హత్తి పాన్పుపై నాయిత్తమై వున్నది
ఇత్తల శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
కొత్తలుగా నేలితి విక్కువ నింకా నున్నది

(||pallavi||)
emi sese vikkaḍanu yĕṁtabani gaddu nīgu
komali nī rāgale korugŏni vunnadi

(||emi||)
ichchagamāḍenani nī kidavari nayyenani
kŏchchi sĕlulado nĕṁchugŏṁṭā nunnavi
muchchaḍāḍenani sadi momusūsi mŏkkenani
vichchese vāḍagunani veḽagāsugunnadi

(||emi||)
sanavarinayyenani sarasamāḍenani
manasulo saṁtosiṁchi marigunnadi
pĕnam̐gulāḍenani priyamulu sĕppenani
tanivoniradulagum̐ damagiṁchi vunnadi

(||emi||)
sittamu dĕlisenani segŏni kūḍĕnani
hatti pānpubai nāyittamai vunnadi
ittala śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
kŏttalugā nelidi vikkuva niṁkā nunnadi