ఏమి సేసే విక్కడను ఇంతి మనోరథములు
(॥పల్లవి॥)
ఏమి సేసే విక్కడను ఇంతి మనోరథములు
వాములు వేసుకున్నది వైళమే రావయ్యా
(॥ఏమి॥)
వంతులు వెట్టుక నీపై వలపులెల్లా నాడ
దొంతులు వెట్టుకున్నది తొయ్యలి
చెంతనే చెక్కుచేతితో చెమటల కాలువల
చింతలకు నీరు గట్టీఁ జిత్తగింతువు రావయ్యా
(॥ఏమి॥)
జాలితోడ విరహాన సారెకు నిట్టూర్పుల -
గాలి ముడియల గట్టీఁ గామిని
తాలిమితోఁ గోరికలఁ దగిలించి రతులకు
గాలాలు వేసుకున్నది కనుఁగొందువు రావయ్యా
(॥ఏమి॥)
రాఁపుల నీవు వచ్చేటి రాకల కెదురుండి
చూపులఁ బౌఁజులు వెట్టీ సుదతి
యేపున శ్రీవేంకటేశ యేలితివీకెను మోవి -
తీపుల విందులు వెట్టీఁ దిలకింతువు రావయ్యా
(||pallavi||)
emi sese vikkaḍanu iṁti manorathamulu
vāmulu vesugunnadi vaiḽame rāvayyā
(||emi||)
vaṁtulu vĕṭṭuga nībai valabulĕllā nāḍa
dŏṁtulu vĕṭṭugunnadi tŏyyali
sĕṁtane sĕkkusedido sĕmaḍala kāluvala
siṁtalagu nīru gaṭṭīm̐ jittagiṁtuvu rāvayyā
(||emi||)
jālidoḍa virahāna sārĕgu niṭṭūrbula -
gāli muḍiyala gaṭṭīm̐ gāmini
tālimidom̐ gorigalam̐ dagiliṁchi radulagu
gālālu vesugunnadi kanum̐gŏṁduvu rāvayyā
(||emi||)
rām̐pula nīvu vachcheḍi rāgala kĕduruṁḍi
sūbulam̐ baum̐julu vĕṭṭī sudadi
yebuna śhrīveṁkaḍeśha yelidivīgĕnu movi -
tībula viṁdulu vĕṭṭīm̐ dilagiṁtuvu rāvayyā