Emi sese vichchadanu imti ninnum biliseeni

ఏమి సేసే విచ్చటను ఇంతి నిన్నుఁ బిలిచీని
Language

(॥పల్లవి॥)
ఏమి సేసే విచ్చటను ఇంతి నిన్నుఁ బిలిచీని
ప్రేమములు కణఁజాలఁ బెట్టుకొందువు రావయ్యా

(॥ఏమి॥)
చెలియచెమటలను చిత్తడివాన గురిసె
బలువుగా వలపులపంటలు వండె
కలిమిమీరి చన్నులు కనకపురాసులాయ
కొలచి కొరు గొందువు కొటారుకు రావయ్యా

(॥ఏమి॥)
వుడివోని తమకపుటూర్పునే తూరుపెత్తె
కడలేనియాసలగాదెలఁ బోసె
యెడయనిపయ్యదనే ఇల్లారుగాఁ బెట్టె
కడలేనిరతుల కంగాణింతువురావయ్యా

(॥ఏమి॥)
పోలపసిగ్గుల పాలపొంగలిగాఁ బెట్టె
వెలయఁ గాఁగిలి నీకు విడిదిసేసె
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
కలసితి విట్టెవచ్చి కాణాచాయ రావయ్యా

(||pallavi||)
emi sese vichchaḍanu iṁti ninnum̐ bilisīni
premamulu kaṇam̐jālam̐ bĕṭṭugŏṁduvu rāvayyā

(||emi||)
sĕliyasĕmaḍalanu sittaḍivāna gurisĕ
baluvugā valabulabaṁṭalu vaṁḍĕ
kalimimīri sannulu kanagaburāsulāya
kŏlasi kŏru gŏṁduvu kŏḍārugu rāvayyā

(||emi||)
vuḍivoni tamagabuḍūrbune tūrubĕttĕ
kaḍaleniyāsalagādĕlam̐ bosĕ
yĕḍayanibayyadane illārugām̐ bĕṭṭĕ
kaḍaleniradula kaṁgāṇiṁtuvurāvayyā

(||emi||)
polabasiggula pālabŏṁgaligām̐ bĕṭṭĕ
vĕlayam̐ gām̐gili nīgu viḍidisesĕ
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
kalasidi viṭṭĕvachchi kāṇāsāya rāvayyā