ఏమి సేసే మిఁక నేము యెంతని దాఁచుకొందుము
(॥పల్లవి॥)
ఏమి సేసే మిఁక నేము యెంతని దాఁచుకొందుము
నీ మహిమ యింతంతన నేరము నేమయ్యా
(॥ఏమి॥)
అంది నిన్ను నొకమాటు హరి యని నుడిగితే
పొందిన పాతకమెల్లాఁ బొలిసిపోయ
మందలించి మఱి యొకమాటు నుడిగిన ఫల-
మందు నీ కప్పగించితి మదిగోవయ్యా
(॥ఏమి॥)
యిట్టె మీకు రెండుచెతులెత్తొకమాటు మొక్కితే
గట్టిగా నిహపరాలు గలిగె మాకు
దట్టముగ సాష్టాంగదండము వెట్టిన ఫల-
మట్టె నీమీఁద నున్నది అదిగోవయ్యా
(॥ఏమి॥)
సరుగ నీకొకమాటు శరణన్నమాత్రమున
సిరులఁ బుణ్యుఁడనైతి శ్రీవేంకటేశ
ధరలోన నే నీకు దాసుఁడనైన ఫల-
మరయ నీమీఁద నున్న దదిగోవయ్యా
(||pallavi||)
emi sese mim̐ka nemu yĕṁtani dām̐sugŏṁdumu
nī mahima yiṁtaṁtana neramu nemayyā
(||emi||)
aṁdi ninnu nŏgamāḍu hari yani nuḍigide
pŏṁdina pādagamĕllām̐ bŏlisiboya
maṁdaliṁchi maṟi yŏgamāḍu nuḍigina phala-
maṁdu nī kappagiṁchidi madigovayyā
(||emi||)
yiṭṭĕ mīgu rĕṁḍusĕdulĕttŏgamāḍu mŏkkide
gaṭṭigā nihabarālu galigĕ māgu
daṭṭamuga sāṣhṭāṁgadaṁḍamu vĕṭṭina phala-
maṭṭĕ nīmīm̐da nunnadi adigovayyā
(||emi||)
saruga nīgŏgamāḍu śharaṇannamātramuna
sirulam̐ buṇyum̐ḍanaidi śhrīveṁkaḍeśha
dharalona ne nīgu dāsum̐ḍanaina phala-
maraya nīmīm̐da nunna dadigovayyā