Emi sese dimkanu yettu ninnum dalamsedi

ఏమి సేసే దిఁకను యెట్టు నిన్నుఁ దలఁచేది
Language

(॥పల్లవి॥)
ఏమి సేసే దిఁకను యెట్టు నిన్నుఁ దలఁచేది
నీ మతకమే కాఁబోలు నీరజనాభా

(॥ఏమి॥)
ఉఱక మనుజులకు నొక్కొక్కవేళ గుణము
మఱపుఁ దెలివి నేను మరులు గాదు
మఱియు నెంచి చూచితే మనసు నొక్కొక్కవేళ
గుఱి గడవఁగఁ బారు గుఱ్ఱముఁ గాదుఁ

(॥ఏమి॥)
పన్నుక వొక్కొక్కవేళ పరులపై మచ్చరము
తన్నుఁ దానే వచ్చి పట్టు దయ్యముఁ గాదు
తిన్ననై బత్తెము గొని దీపన మొక్కొక్కవేళ
వన్నెకెక్కిన యప్పుల వాఁడుఁ దాఁ గాఁడు

(॥ఏమి॥)
ముంచుకొను మోహము మొనసి యొక్కొక్కవేళ
పొంచి ముందు వెనకల మంచుఁ గాదు
యెంచఁగ శ్రీవేంకటేశ యిందరికి దిక్కు నీవే
నించితి నీ కృప అది నీ కడ్డము గాదు

(||pallavi||)
emi sese dim̐kanu yĕṭṭu ninnum̐ dalam̐sedi
nī madagame kām̐bolu nīrajanābhā

(||emi||)
uṟaga manujulagu nŏkkŏkkaveḽa guṇamu
maṟabum̐ dĕlivi nenu marulu gādu
maṟiyu nĕṁchi sūside manasu nŏkkŏkkaveḽa
guṟi gaḍavam̐gam̐ bāru guṭramum̐ gādum̐

(||emi||)
pannuga vŏkkŏkkaveḽa parulabai machcharamu
tannum̐ dāne vachchi paṭṭu dayyamum̐ gādu
tinnanai battĕmu gŏni dībana mŏkkŏkkaveḽa
vannĕgĕkkina yappula vām̐ḍum̐ dām̐ gām̐ḍu

(||emi||)
muṁchugŏnu mohamu mŏnasi yŏkkŏkkaveḽa
pŏṁchi muṁdu vĕnagala maṁchum̐ gādu
yĕṁcham̐ga śhrīveṁkaḍeśha yiṁdarigi dikku nīve
niṁchidi nī kṛpa adi nī kaḍḍamu gādu