Emi seppudum gaamtaalamitlaaya naa valabu

ఏమి చెప్పుదుఁ గాఁతాళమిట్లాయ నా వలపు
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పుదుఁ గాఁతాళమిట్లాయ నా వలపు
కామించినదాన నీకు కరుణించు మిఁకను

(॥ఏమి॥)
కుప్పళించి నిన్న రానికోపమే చూపుతిఁగాని
చొప్పుగా నెదుట నిన్నుఁ జూడనైతిని
చెప్పకు బుద్ధులనుచు చెలికి మొక్కితిఁ గాని
ముప్పిరిఁ జేతులెత్తి మొక్కనైతి నీకును

(॥ఏమి॥)
తత్తరించి నీవు సేసే తప్పులే పట్టితిఁ గాని
బత్తి నీ విచ్చేబాగాలు పట్టనైతిని
యిత్తల సవతులతో నెమ్మెలు చెప్పితిఁగాని
హత్తి నీతో నవ్వుచుఁ బ్రియములు చెప్పనైతి

(॥ఏమి॥)
వెక్కసపుమాటాడఁగా వీఁగ నొత్తితిఁ గాని
తక్కక చాఁచిన నీపాదా లొత్తనైతి
నిక్కి శ్రీ వేంకటేశుఁడ నేనలమేలు మంగను
మక్కువ నేర్చితిఁగాని మంకు నేరనైతిని

(||pallavi||)
emi sĕppudum̐ gām̐tāḽamiṭlāya nā valabu
kāmiṁchinadāna nīgu karuṇiṁchu mim̐kanu

(||emi||)
kuppaḽiṁchi ninna rānigobame sūbudim̐gāni
sŏppugā nĕduḍa ninnum̐ jūḍanaidini
sĕppagu buddhulanusu sĕligi mŏkkidim̐ gāni
muppirim̐ jedulĕtti mŏkkanaidi nīgunu

(||emi||)
tattariṁchi nīvu sese tappule paṭṭidim̐ gāni
batti nī vichchebāgālu paṭṭanaidini
yittala savadulado nĕmmĕlu sĕppidim̐gāni
hatti nīdo navvusum̐ briyamulu sĕppanaidi

(||emi||)
vĕkkasabumāḍāḍam̐gā vīm̐ga nŏttidim̐ gāni
takkaga sām̐sina nībādā lŏttanaidi
nikki śhrī veṁkaḍeśhum̐ḍa nenalamelu maṁganu
makkuva nersidim̐gāni maṁku neranaidini