ఏమి చెప్పేవు సుద్దులు యెందాఁకాను
(॥పల్లవి॥)
ఏమి చెప్పేవు సుద్దులు యెందాఁకాను
వేమారు వెన్నెలేకాదా వేసవయ్యేది
(॥ఏమి॥)
పురుషుఁడైతేనేమి పొలిఁతియైతేనేమి
వరుస నొకటేకాదా వాసిపట్లు
కడఁగి చొక్కిననేమి కడువెరగైతేనేమి
మరునియమ్ములేకావా మతి నాఁటేవి
(॥ఏమి॥)
వొంటి నేలికైతేనేమి వూడిగపుదై తేనేమి
జంటల సరేకావా జవ్వనములు
ఇంటిలో నైతేనేమి యీవాకిట నైతేనేమి
అంటి చల్లగాలేకాదా ఆయాలు రేఁచేది
(॥ఏమి॥)
దేవరయైతేనేమి దేవులైతే మరియేమి
వావిరిఁ బొత్తేకాదా వలపులెల్లా
శ్రీవేంకటేశ్వరుఁడ చేరి నన్నుఁ గూడితివి
కోవిలకూఁతలేకావా గురులయ్యేవి
(||pallavi||)
emi sĕppevu suddulu yĕṁdām̐kānu
vemāru vĕnnĕlegādā vesavayyedi
(||emi||)
puruṣhum̐ḍaidenemi pŏlim̐tiyaidenemi
varusa nŏgaḍegādā vāsibaṭlu
kaḍam̐gi sŏkkinanemi kaḍuvĕragaidenemi
maruniyammulegāvā madi nām̐ṭevi
(||emi||)
vŏṁṭi neligaidenemi vūḍigabudai tenemi
jaṁṭala saregāvā javvanamulu
iṁṭilo naidenemi yīvāgiḍa naidenemi
aṁṭi sallagālegādā āyālu rem̐sedi
(||emi||)
devarayaidenemi devulaide mariyemi
vāvirim̐ bŏttegādā valabulĕllā
śhrīveṁkaḍeśhvarum̐ḍa seri nannum̐ gūḍidivi
kovilagūm̐talegāvā gurulayyevi