Emi seppevu suddulu yemdaamka maado

ఏమి చెప్పేవు సుద్దులు యెందాఁక మాతో
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పేవు సుద్దులు యెందాఁక మాతో
కామించినటువలెఁ గైకొందువు గాక

(॥ఏమి॥)
పంతములాడఁగనేల బలిమి గలితే నీకు
చెంతనుండ యేమైనా జేతువుగాక
వింతలు మరేడవి వెల్లావిరైననీకు
నంతకూటములనె జడుతువుగాక

(॥ఏమి॥)
అనుమానాలు మరేల అన్నిటా సర్వజ్ఞుఁడవు
చెనకి మమ్ము రట్టుసేతువుగాక
వెనకముందేడది వేడుకగలుగునీకు
పనిగలయపెడెల్లాఁ బైకొందువుగాక

(॥ఏమి॥)
సిగ్గు వీడనేల నీకు శ్రీవేంకటేశుఁడవు
వొగ్గి నన్నేలితి విట్టె వుందువుగాక
యెగ్గుదప్పు లేడవి యింతవలచిననీకు
కగ్గులేక యిట్లానే కలతువు గాక

(||pallavi||)
emi sĕppevu suddulu yĕṁdām̐ka mādo
kāmiṁchinaḍuvalĕm̐ gaigŏṁduvu gāga

(||emi||)
paṁtamulāḍam̐ganela balimi galide nīgu
sĕṁtanuṁḍa yemainā jeduvugāga
viṁtalu mareḍavi vĕllāvirainanīgu
naṁtagūḍamulanĕ jaḍuduvugāga

(||emi||)
anumānālu marela anniḍā sarvajñum̐ḍavu
sĕnagi mammu raṭṭuseduvugāga
vĕnagamuṁdeḍadi veḍugagalugunīgu
panigalayabĕḍĕllām̐ baigŏṁduvugāga

(||emi||)
siggu vīḍanela nīgu śhrīveṁkaḍeśhum̐ḍavu
vŏggi nannelidi viṭṭĕ vuṁduvugāga
yĕggudappu leḍavi yiṁtavalasinanīgu
kaggulega yiṭlāne kaladuvu gāga