ఏమి చెప్పేవు నీసుద్దు లెరఁగమటే
(॥పల్లవి॥)
ఏమి చెప్పేవు నీసుద్దు లెరఁగమటే
నేము నీవలన కామా నెట్టన విభునికి
(॥॥)
పంతమాడేదానవు పడఁతులఁ బెట్టి పంపి
కాంతుని రప్పించుకొనఁ గారణమేమే
ఇఁత యెమ్మెలదానవు యెదురుగాఁ బో యతని
కఁతకంతకును వినలు సేయనేలే
(॥॥)
కడువాసికత్తెవు కందువ నాతనిఁ జేరి
ఆడియాలమైనసొమ్ము లడుగనేలే
వొడఁబడనిదానవు వూడిగాలెల్లాఁ జేసి
జడిగొన్న కెమ్మోవి చవిచూపనేలే
(॥॥)
దొరతనాల దానవు దొరసి శ్రీ వేంకటేశుఁ
గరగించి కూడితివి కతలేఁటికే
నిరతి నన్నేలినాఁడు నేనలమేలుమంగను
మరిగా యప్పటి నీవు మలయనేమిటికే
(||pallavi||)
emi sĕppevu nīsuddu lĕram̐gamaḍe
nemu nīvalana kāmā nĕṭṭana vibhunigi
(||||)
paṁtamāḍedānavu paḍam̐tulam̐ bĕṭṭi paṁpi
kāṁtuni rappiṁchugŏnam̐ gāraṇameme
im̐ta yĕmmĕladānavu yĕdurugām̐ bo yadani
kam̐tagaṁtagunu vinalu seyanele
(||||)
kaḍuvāsigattĕvu kaṁduva nādanim̐ jeri
āḍiyālamainasŏmmu laḍuganele
vŏḍam̐baḍanidānavu vūḍigālĕllām̐ jesi
jaḍigŏnna kĕmmovi savisūbanele
(||||)
dŏradanāla dānavu dŏrasi śhrī veṁkaḍeśhum̐
garagiṁchi kūḍidivi kadalem̐ṭige
niradi nannelinām̐ḍu nenalamelumaṁganu
marigā yappaḍi nīvu malayanemiḍige