ఏమి చెప్పేవు నీ సుద్దు లెఱఁగ నేమిన్నియు
(॥పల్లవి॥)
ఏమి చెప్పేవు నీ సుద్దు లెఱఁగ నేమిన్నియు
వోముక సంగతి చేసుకున్నారముగాక
(॥ఏమి॥)
సందడి నాపెతోడ సరసమాడేవాఁడవు
పొందుసేయకుందువా పోసఁగించుక
ముందుముందుగా నిట్టె మోము చూచేవాఁడవు
చెంది సేసేచేఁతలెల్లాఁ జేయకుందువా
(॥ఏమి॥)
యేకతాన వీడెము నీవిచ్చినట్టివాఁడవు
ఆకుమడిచీకుందువా అప్పటి నీవు
చేకొని యేపొద్దూ నిట్టిసేవల గొనెవాఁడవు
కాకరితనాల నీవు కలయకుండుదువా
(॥ఏమి॥)
కులికి చన్నులమీఁద గోరగీరినవాఁడవు
వలవక వుందువా వాఁటమై నీవు
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
అలరి నన్నేలితివి ఆపె నంటకుందువా
(||pallavi||)
emi sĕppevu nī suddu lĕṟam̐ga neminniyu
vomuga saṁgadi sesugunnāramugāga
(||emi||)
saṁdaḍi nābĕdoḍa sarasamāḍevām̐ḍavu
pŏṁduseyaguṁduvā posam̐giṁchuga
muṁdumuṁdugā niṭṭĕ momu sūsevām̐ḍavu
sĕṁdi sesesem̐talĕllām̐ jeyaguṁduvā
(||emi||)
yegadāna vīḍĕmu nīvichchinaṭṭivām̐ḍavu
āgumaḍisīguṁduvā appaḍi nīvu
segŏni yebŏddū niṭṭisevala gŏnĕvām̐ḍavu
kāgaridanāla nīvu kalayaguṁḍuduvā
(||emi||)
kuligi sannulamīm̐da goragīrinavām̐ḍavu
valavaga vuṁduvā vām̐ṭamai nīvu
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
alari nannelidivi ābĕ naṁṭaguṁduvā