ఏమి చెప్పేరే బుద్దులు ఇద్దరు నొక్కటే తాము
(॥పల్లవి॥)
ఏమి చెప్పేరే బుద్దులు ఇద్దరు నొక్కటే తాము
సాములెంత సేసినాను చనవులై వుండు
(॥ఏమి॥)
చెలువపురమణుఁడు సేఁత లేమిసేసినాను
యెలమి మోహించునింతికింపులై వుండు
తలఁచుకొంటే నవే తగులాయములై వుండు
కలిమితో మేనికిసింగారములై వుండు
(॥ఏమి॥)
ననుపైన నాయకుఁడు నవ్వులెన్ని నవ్వినాను
యెనసినకామినికిఇంపులై వుండు
తనివోనివేడుకకుఁ దరితీపులై వుండు
పెనఁగినప్పుడెల్లాను ప్రియములై వుండు
(॥ఏమి॥)
యీరీతి శ్రీవేంకటేశుఁ డెంత కాఁగిలించినాను
యీరసములెల్లా మాని ఇంపులై వుండు
తారుకాణలైవుండు తమకములై వుండు
వూరేటియమృతమెల్లా వుట్టిపడివుండు
(||pallavi||)
emi sĕppere buddulu iddaru nŏkkaḍe tāmu
sāmulĕṁta sesinānu sanavulai vuṁḍu
(||emi||)
sĕluvaburamaṇum̐ḍu sem̐ta lemisesinānu
yĕlami mohiṁchuniṁtigiṁpulai vuṁḍu
talam̐sugŏṁṭe nave tagulāyamulai vuṁḍu
kalimido menigisiṁgāramulai vuṁḍu
(||emi||)
nanubaina nāyagum̐ḍu navvulĕnni navvinānu
yĕnasinagāminigiiṁpulai vuṁḍu
tanivoniveḍugagum̐ daridībulai vuṁḍu
pĕnam̐ginappuḍĕllānu priyamulai vuṁḍu
(||emi||)
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍĕṁta kām̐giliṁchinānu
yīrasamulĕllā māni iṁpulai vuṁḍu
tārugāṇalaivuṁḍu tamagamulai vuṁḍu
vūreḍiyamṛtamĕllā vuṭṭibaḍivuṁḍu