Emi seppere buddu lemdaamkam jelulaala

ఏమి చెప్పేరే బుద్దు లెందాఁకఁ జెలులాల
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పేరే బుద్దు లెందాఁకఁ జెలులాల
దోమటి కింతే కలితే తోడితేరే పతిని

(॥ఏమి॥)
నెలకొని పారేపాము నిలువఁగవచ్చుఁగాక
వల పెందైనా నిలుపఁగ వచ్చునటవె
అలరి సూర్యునిఁ జేత నణఁచఁగ వచ్చుఁగాక
నలువంక విరహ మణఁచ వచ్చునటవె

(॥ఏమి॥)
కడలేనియేరైనాఁ గట్టివేయవచ్చుఁ గాక
వడి నాస మూట గట్టవచ్చునటవె
సుడివడఁ బౌజు లచ్చుగ నాఁపవచ్చుఁగాక
అడరినతమకము లాఁపవచ్చునటవె

(॥ఏమి॥)
అలసముద్రము దాఁటనైనాను వచ్చుఁగాక
వలరాజునాజ్ఞ దాఁటవచ్చునటవె
యెలమి శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
కలశ నితనిఁ బాయఁగా వచ్చునటనె

(||pallavi||)
emi sĕppere buddu lĕṁdām̐kam̐ jĕlulāla
domaḍi kiṁte kalide toḍidere padini

(||emi||)
nĕlagŏni pārebāmu niluvam̐gavachchum̐gāga
vala pĕṁdainā nilubam̐ga vachchunaḍavĕ
alari sūryunim̐ jeda naṇam̐sam̐ga vachchum̐gāga
naluvaṁka viraha maṇam̐sa vachchunaḍavĕ

(||emi||)
kaḍaleniyerainām̐ gaṭṭiveyavachchum̐ gāga
vaḍi nāsa mūḍa gaṭṭavachchunaḍavĕ
suḍivaḍam̐ bauju lachchuga nām̐pavachchum̐gāga
aḍarinadamagamu lām̐pavachchunaḍavĕ

(||emi||)
alasamudramu dām̐ṭanainānu vachchum̐gāga
valarājunājña dām̐ṭavachchunaḍavĕ
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
kalaśha nidanim̐ bāyam̐gā vachchunaḍanĕ