ఏమి చెప్పేరమ్మలాల యీతని నే నెరఁగనా
(॥పల్లవి॥)
ఏమి చెప్పేరమ్మలాల యీతని నే నెరఁగనా
ప్రేమతోడఁ దా వచ్చితేఁ బిలిచేఁ గాని
(॥ఏమి॥)
వొలసీనొల్లనిపతి నొగి కాఁగిలించుకంటే
సొలసి మాను గాఁగిలించుటే మేలు
చలపట్టినవానితో సరస మాడుటకంటే
కెలసి రాయి గిలిగించుటే మేలు
(॥ఏమి॥)
వసముగానివిభునివంక చూచుటకంటె
సుసరాన మునిగోడ చూచుటే మేలు
పిసలేని వారిఁ బేరఁ బిలువఁబోవుటకంటె
కొసిరి కొండసెలకు కుయ్యుటే మేలు
(॥ఏమి॥)
పంతపురమణు మోవి పంటి చవడుగుకంటె
పొంతఁ జెఱకుఁబిప్పి తీపులే మేలు
ఇంతలో శ్రీ వేంకటేశుఁడితఁ డిట్టె నన్నుఁ గూడె
వంతుకు నెంతైనా నీవలుపే మేలు
(||pallavi||)
emi sĕpperammalāla yīdani ne nĕram̐ganā
premadoḍam̐ dā vachchidem̐ bilisem̐ gāni
(||emi||)
vŏlasīnŏllanibadi nŏgi kām̐giliṁchugaṁṭe
sŏlasi mānu gām̐giliṁchuḍe melu
salabaṭṭinavānido sarasa māḍuḍagaṁṭe
kĕlasi rāyi giligiṁchuḍe melu
(||emi||)
vasamugānivibhunivaṁka sūsuḍagaṁṭĕ
susarāna munigoḍa sūsuḍe melu
pisaleni vārim̐ beram̐ biluvam̐bovuḍagaṁṭĕ
kŏsiri kŏṁḍasĕlagu kuyyuḍe melu
(||emi||)
paṁtaburamaṇu movi paṁṭi savaḍugugaṁṭĕ
pŏṁtam̐ jĕṟagum̐bippi tībule melu
iṁtalo śhrī veṁkaḍeśhum̐ḍidam̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
vaṁtugu nĕṁtainā nīvalube melu