Emi seppemu neesuddu lemtavadiyainaanu

ఏమి చెప్పేము నీసుద్దు లెంతవడియైనాను
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పేము నీసుద్దు లెంతవడియైనాను
చే ముంచి నా తురుముపైఁ జేయి వేయవలెనా

(॥॥)
పొఁడిమి నందరితోడాఁ బొందు సేయనేర్తువట
నేఁడు నన్ను నమ్మించ నేరవా నీవు
ఆఁడువారము గనక అలసి నిన్ను దూరితే
వాఁడికొనగోర చంద్రవంక లొత్తవలెనా

(॥॥)
ననిచినవారితొడ నవ్వునవ్వ నేర్తువట
పెనఁగి నన్ను సమ్మతింపించనేరవా
వనితలముగనక వడి నిన్ను సొలసితే
ఘనమైనచన్నులు విసుకఁగ నింతవలెనా

(॥॥)
శ్రీ వేంకటేశ కొల్వులో సిగ్గువడనేర్తువట
యీవల నన్నుఁ గూడితి వింతనేరవా
కైవసపుటింతులముగనక నిన్ను మెచ్చితే
చేవదేరేమోవితేనె చిప్పిలించవలెనా

(||pallavi||)
emi sĕppemu nīsuddu lĕṁtavaḍiyainānu
se muṁchi nā turumubaim̐ jeyi veyavalĕnā

(||||)
pŏm̐ḍimi naṁdaridoḍām̐ bŏṁdu seyanerduvaḍa
nem̐ḍu nannu nammiṁcha neravā nīvu
ām̐ḍuvāramu ganaga alasi ninnu dūride
vām̐ḍigŏnagora saṁdravaṁka lŏttavalĕnā

(||||)
nanisinavāridŏḍa navvunavva nerduvaḍa
pĕnam̐gi nannu sammadiṁpiṁchaneravā
vanidalamuganaga vaḍi ninnu sŏlaside
ghanamainasannulu visugam̐ga niṁtavalĕnā

(||||)
śhrī veṁkaḍeśha kŏlvulo sigguvaḍanerduvaḍa
yīvala nannum̐ gūḍidi viṁtaneravā
kaivasabuḍiṁtulamuganaga ninnu mĕchchide
sevaderemovidenĕ sippiliṁchavalĕnā