ఏమి చెప్పేమిఁక నీతో నింతికతలు
(॥పల్లవి॥)
ఏమి చెప్పేమిఁక నీతో నింతికతలు
కామించి నీవే వచ్చి కనుఁగొంటగాక
(॥ఏమి॥)
వుమ్మగిలువలపుల నూరివూరి వానలుగా
కొమ్మమేనఁ జెమటలు గురిసీ నవె
నెమ్మిఁ గొరికలచేత నిగిడినపులకలు
గమ్ముకొని పసిమెక్కె కడుఁ గుచములను
(॥ఏమి॥)
వలగొన్నతలపోఁత వసంతకాలము వచ్చి
నలినాక్షిచింతలు ననిచీ నవె
తొలఁకేతమకముల తురుములోనివిరులు
జలజలరాలుకొంటా జవ్వనము మించెను
(॥ఏమి॥)
వుంగిటియైనతరీతీపు లుపతిలి యలమేలు-
మంగమోవిఁ దీనె లామని వచ్చెను
రంగుగ శ్రీవేంకటేశ రతి నీవు గూడఁగాను
సింగారము రాసులై చెలఁగి చూపట్టెను
(||pallavi||)
emi sĕppemim̐ka nīdo niṁtigadalu
kāmiṁchi nīve vachchi kanum̐gŏṁṭagāga
(||emi||)
vummagiluvalabula nūrivūri vānalugā
kŏmmamenam̐ jĕmaḍalu gurisī navĕ
nĕmmim̐ gŏrigalaseda nigiḍinabulagalu
gammugŏni pasimĕkkĕ kaḍum̐ gusamulanu
(||emi||)
valagŏnnadalabom̐ta vasaṁtagālamu vachchi
nalinākṣhisiṁtalu nanisī navĕ
tŏlam̐kedamagamula turumulonivirulu
jalajalarālugŏṁṭā javvanamu miṁchĕnu
(||emi||)
vuṁgiḍiyainadarīdību lubadili yalamelu-
maṁgamovim̐ dīnĕ lāmani vachchĕnu
raṁguga śhrīveṁkaḍeśha radi nīvu gūḍam̐gānu
siṁgāramu rāsulai sĕlam̐gi sūbaṭṭĕnu