ఏమి చెప్పేమయ్యా నీవే యెరుఁగుదువు వలపు
(॥పల్లవి॥)
ఏమి చెప్పేమయ్యా నీవే యెరుఁగుదువు వలపు
వాములాయ నీకు నాకు వదలకు వలపు
(॥ఏమి॥)
చలము గలిగితేను చాయకువచ్చు వలపు
అలుగకుండితేను అంటు వలప
బలిమిఁ బెనఁగకున్న పాయనియ్యదు వలపు
నిలచిపోకుండితేను నెట్టుకొను వలపు
(॥ఏమి॥)
వచ్చినట్టే వచ్చితేను వసమైయుండు వలపు
ముచ్చటలు గలిగితేను ముంచు వలపు
కొచ్చికొచ్చి కొసరితేను కొనసాగును వలపు
యిచ్చకము లాడితేను యియ్యకోలౌ వలపు
(॥ఏమి॥)
యెడమాఁట లాడితేను యెంతైనా నిండు వలపు
యెడతెగకుండితను హెచ్చు వలపు
అడరి శ్రీవేంకటేశ యట్టె నన్ను నేలితివి
పెడరేఁచితే నెంతైనాఁ బెరుగును వలపు
(||pallavi||)
emi sĕppemayyā nīve yĕrum̐guduvu valabu
vāmulāya nīgu nāgu vadalagu valabu
(||emi||)
salamu galigidenu sāyaguvachchu valabu
alugaguṁḍidenu aṁṭu valaba
balimim̐ bĕnam̐gagunna pāyaniyyadu valabu
nilasiboguṁḍidenu nĕṭṭugŏnu valabu
(||emi||)
vachchinaṭṭe vachchidenu vasamaiyuṁḍu valabu
muchchaḍalu galigidenu muṁchu valabu
kŏchchigŏchchi kŏsaridenu kŏnasāgunu valabu
yichchagamu lāḍidenu yiyyagolau valabu
(||emi||)
yĕḍamām̐ṭa lāḍidenu yĕṁtainā niṁḍu valabu
yĕḍadĕgaguṁḍidanu hĕchchu valabu
aḍari śhrīveṁkaḍeśha yaṭṭĕ nannu nelidivi
pĕḍarem̐side nĕṁtainām̐ bĕrugunu valabu