Emi seppemayya needo nimtibhaavamu

ఏమి చెప్పేమయ్య నీతో నింతిభావము
Language

(॥పల్లవి॥)
ఏమి చెప్పేమయ్య నీతో నింతిభావము
సోమరితనములేల చూతువు రావయ్యా

(॥ఏమి॥)
చెక్కిటఁ జెలికిఁ జేయి చిత్తములోచింత నూయి
వెక్కతో నిన్నుఁ బాసినవిరహవేళ
నిక్కీ మైఁ బులకలు చిక్కుదీర్చెయలకలు
అక్కజపునీసుద్దు లాలకించేవేళను

(॥ఏమి॥)
కన్నుల చూపుతేటలు కమ్మఁజెమటవూటలు
వెన్నుఁడ నీగుణములు వినేవేళ
చెన్నగునిట్టూరువులు సిగ్గులతో వోరువులు
తన్నుఁదానె పానువుపై తంపోసేవేళ

(॥ఏమి॥)
చేరి పెండ్లాడినచొక్కు చేతులపై నీకు మొక్కు
రారాఁపుగా నిన్నుఁగూడేరతులవేళ
యీరాతి శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగి
సారెకు నీవేలినయీసరసపు వేళ

(||pallavi||)
emi sĕppemayya nīdo niṁtibhāvamu
somaridanamulela sūduvu rāvayyā

(||emi||)
sĕkkiḍam̐ jĕligim̐ jeyi sittamulosiṁta nūyi
vĕkkado ninnum̐ bāsinavirahaveḽa
nikkī maim̐ bulagalu sikkudīrsĕyalagalu
akkajabunīsuddu lālagiṁcheveḽanu

(||emi||)
kannula sūbudeḍalu kammam̐jĕmaḍavūḍalu
vĕnnum̐ḍa nīguṇamulu vineveḽa
sĕnnaguniṭṭūruvulu siggulado voruvulu
tannum̐dānĕ pānuvubai taṁposeveḽa

(||emi||)
seri pĕṁḍlāḍinasŏkku sedulabai nīgu mŏkku
rārām̐pugā ninnum̐gūḍeradulaveḽa
yīrādi śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁgi
sārĕgu nīvelinayīsarasabu veḽa